ఘనంగా బాబు జగ్జివన్ రావ్ జయంతి వేడుకలు

 


బాబు జగ్జీవన్ రావ్ గొప్ప సంఘసంస్కర్త 

ఇల్లందు, అక్షిత మీడియా: -

బాబు జగ్జీవన్ రావ్ గొప్ప సంఘసంస్కర్త అని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానీయుడని టీఎంహెచ్ డి రాష్ట్ర అధ్యక్షులు కొరిపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జి మంద కుమార్ అధ్యక్షతన పట్టణంలోని 22వ వార్డు నందు 119వ బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు

ఈ కార్యక్రమంలో అక్షిత మీడియా సీఈఓ అండ్ ఎడిటర్ నాతరి రంజిత్ పాల్గొని మాట్లాడుతూ బాబు జగజీవరావు దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచిన గొప్ప దళిత వేత్త గా అతని చేసిన దళిత ఉద్యమాలు అంత ఇంత కావు అలాంటి మహానీయుడు బాటలో దళిత సామాజిక వర్గం ఎప్పుడు నడవాల్సిన అవసరం ఉందని దళిత పోరాటంలో చురుకైన పాత్ర దళిత యువత ఉండాలని కొనియాడారు. . ఈ సందర్భంగా 22వ వార్డు కౌన్సిలర్ కొర్లపాటి శివ కిరణ్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా, పరిపాలన దక్షత తో దేశ ఉప ప్రధానిగా అఖండ భారతవానికి విశేష సేవలందించారన్నారు. దేశ ఉప ప్రధానిగా భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించారని కొనియాడారు. ఆయన 40 సంవత్సరాల పైగా వివిధ శాఖలలో మంత్రిగా పనిచేశారు. అతను భారతదేశ చరిత్రలో ఎక్కువ కాలం కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పనిచేశాడు. ఈ కార్యక్రమంలో ఇల్లందు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భానోత్ రవి నాయక్, టీఎంహెచ్ డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మునగలేటి వీరస్వామి, రాయల శ్రీనివాస్, తాండ్ర నాగరాజు, బసిపాక రవి, సిర్ర ఉపేందర్, రామకృష్ణ, కాంతారావు, మాచర్ల విజయ్ కుమార్, కాశి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview