వామ్మో ప్రభుత్వ ఆసుపత్రి!!!

 






వామ్మో ప్రభుత్వ ఆసుపత్రి!!

వైద్యుల నిర్లక్ష్యంపై హెచ్ఆర్సి ఆగ్రహం!!

కమిటీ తీర్మానం అనంతరం శాఖ పరమైన చర్యలకు సిద్ధం!!

సిబ్బంది డ్యూటీ ల విషయంలో కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సూపర్డెంట్ !!!

ఖమ్మం, అక్షిత మీడియా:-ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి అనేక విమర్శలకు తావిచ్చే విధంగా ఉన్న విధానం మనకు అర్థం అవుతుంది ముఖ్యంగా వైద్యులు నిర్లక్ష్యం వల్ల 7 నెలల పసికందు యొక్క మూచి వారికి చేతిని కోల్పోయిన ప్రస్తుత విషయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు హెచ్ఆర్సీ నుంచి నోటీసులు రావడం దీనిపై కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా ముగ్గురు కమిటీ సభ్యులుగా నీలోఫర్ ఆసుపత్రికి , ఎంజీఎం కు , ఖమ్మం మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి సీనియర్ డాక్టర్లతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఈ ప్రాంతంలో జరిగిన దానిపై సమగ్ర విచారణ జరిపించి కమిటీ నివేదికను హెచ్ఆర్సీ కమిషనర్ కు అందజేయడం జరుగుతుంది. అదే కాకుండా కమిటీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా హెచ్ఆర్సీకి సంబంధించిన సిబ్బంది కూడా ఈ కమిటీలో పాల్గొంటారు, దీని విషయమై హాస్పటల్ సూపర్డెంట్ నరేందర్ నీ వివరణ కోరగా ఆస్పత్రిలో మా యొక్క వైద్య బృందం, సిబ్బంది ఎవరైతే ఇబ్బంది గురైనటువంటి పిల్లవాడికి సక్రమమైనటువంటి వైద్యం అందించడమే కాకుండా పిల్లవాడు యొక్క ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులకి తెలియజేయడం జరిగింది కానీ తన చేతికి సంబంధించినటువంటి రక్తప్రసరణకు సంబంధించిన నరాలు స్టక్ అవడంతో చేతికి ఇన్ఫెక్షన్ ఏర్పడి దానివల్ల మనకు దగ్గర ఉన్నటువంటి వైద్యం అందించాం తదుపరి హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్ కి రిఫర్ చేయటంతో అక్కడికి వెళ్ళినప్పుడు వైద్యులు పరిశీలించి అతని యొక్క చేతికైనా ఇన్ఫెక్షన్ తల్లిదండ్రులకు తెలియజేసి చేతిని తొలగించకపోయినట్లయితే పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం కాబట్టి ఆపరేషన్ చేసి చేతిని తొలగించడం జరుగుతుంది. దీనిపై వివిధ పత్రికలలో చానల్లో కథనాలు రావడంతో స్పందించినటువంటి  హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ వ్యవహారంపై సీరియస్ గా తీసుకొని సంబంధించిన సిబ్బందిపై చర్యల కోసం టి.ఎం అండ్ హెచ్ ఓ కి వివరణ నిమిత్తం నోటీసులు అందించటమే కాకుండా, కమిటీని వేసి నివేదిక ఆధారంగా సంబంధించిన సిబ్బందిపై చర్యలకి ఉపేక్షించడానికి సిద్ధంగా ఉన్నాం అని నోటీసు యొక్క సారాంశాన్ని సూపర్డెంట్ తెలియజేయడం జరిగింది. విమర్శలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ అంటానికి నిలువుటద్దంగా నిలుస్తున్నటువంటి ప్రశ్నలు అనేకం కనిపిస్తున్నాయి. 

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి అనేక మంది డాక్టర్లు వారు ఇక్కడ సమయాన్ని కేటాయించడం కన్నా వారి యొక్క ప్రైవేటు వైద్యశాలలో ఎక్కువ సమయం కేటేస్తున్నట్టు వస్తున్న విమర్శలపై అటువంటి ఏమీ మా దృష్టికి రాలేదు. ఆ విధంగా ఇచ్చినట్లయితే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అదే కాకుండా డ్యూటీ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకి ఆ పని సమయంలో తప్పకుండా వైద్యులు సిబ్బంది డ్యూటీలో ఉండాలి ఆ విధంగా ఉండకుండా వారి సొంత అవసరాల నిమిత్తం గనుక వెళ్లి అక్కడ ఉన్నట్లయితే వారికి శాఖ పరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, 

క్యాన్సర్ పేషంట్లకి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందించడానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ఎంఎన్ జె క్యాన్సర్ ఆసుపత్రి నందు మొదటిసారి పరీక్షలు జరిపించుకొని ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మరొక దప వైద్యం కోసం అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు అక్కడ నుంచి ఓపిక సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా వద్దకు వచ్చినట్లయితే ఇక్కడ వారికి కావలసినటువంటి వైద్యం అందించడానికి మేము మా సిబ్బంది సిద్ధంగా ఉన్నాం!!ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి నర్సులు యొక్క డ్యూటీ టైమింగ్స్ కానీ సిబ్బంది యొక్క టైమింగ్స్ ని గాని చూస్తే ఏకపక్షంగా ఒక వర్గానికి కొమ్ముకాస్తూ డ్యూటీలు వెయ్యకపోవటమే కాకుండా మిగతా వారికి మాత్రం నైట్ డ్యూటీలు ,పగల డ్యూటీలు అనే తారతమ్యం లేకుండా ఇష్ట సారంగా డ్యూటీలు విధిస్తున్నట్టు దీనిపై అంతర్గతంగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి సిబ్బంది సూపర్డెంట్ వద్దకు వెళ్తే వారిని ఏకపక్షంగా వ్యవహరిస్తూ మీరు వేసిన డ్యూటీలు చేస్తున్నమో డ్యూటీలు ఉంటాయి లేకపోతే మిమ్మల్ని కన్నుంచి ట్రాన్స్ఫర్ చేపిస్తా అని బెదిరింపులకు కూడా దిగుతున్నట్లు అంతర్గతంగా మదనపడుతున్నటువంటి సిబ్బంది, దీనిపై బయటికి వస్తే మమ్మల్ని సూపర్డెంట్ ఇంకా ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తాడు అన్న భయంతో చేసేది ఏమీ లేక తమ విధులను నిర్వహించుకుంటున్నట్టు కూడా సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి దీనిపై కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఇటువంటి సూపర్డెంట్ ని తక్షణమే విధుల నుంచి తొలగించి సిబ్బందికి వైద్యం కోసం ప్రజలకి తగు న్యాయం చేసి ప్రజలకి అన్ని విధాలుగా అండదండగా ఉంటే సూపర్డెంట్ నే నియమించాలని, అంతర్గతంగా మతం పడుతున్నటువంటి సిబ్బంది మాటల్లో వినిపిస్తుంది. మరింత ముఖ్యమైన సమాచారంతో మరొక కథనం తో మీ ముందుకు వస్తాం!! మీ అక్షిత మీడియా, యాజమాన్యం!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview