ధనార్జన లేక నిర్లక్ష్యమా!! ఉన్నత అధికారుల వల్ల కిందిస్థాయి సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారా!!

 


 ధనర్జన లేక నిర్లక్ష్యమా!!

ఆర్టీవో అధికారుల నిర్లక్ష్యంతో కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు వచ్చిన పరిస్థితి!!

ఖమ్మం ,అక్షిత మీడియా;-రాష్ట్రంలోనే ఆర్టీవో అధికారుల యొక్క విధానం ఉన్నత స్థాయి అధికారుల యొక్క ఒత్తిడితో కిందిస్థాయి సిబ్బంది తమ యొక్క విధుల లో సమయపాలన కి సంబంధం లేకుండా ఉన్నత స్థాయి అధికారులు ఇష్టానుసారంగా డ్యూటీలు వేయటం ఆ డ్యూటీలో ఉన్నటువంటి సిబ్బంది ఉన్నత స్థాయి అధికారుల యొక్క ఆదేశాల మేరకు వాహనాల తనిఖీల సమయంలో ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితులు కూడా అనేకం మనం చూస్తూనే ఉన్నాం!! ముఖ్యంగా ఈ మధ్యకాలంలో విధినిర్వహణలో ఉన్నటువంటి ఆర్టీవో కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితి నుంచి బయటికి వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం, దీనికి అసలు కారణం ఏoటిది దీనిపై సమగ్ర విచారణ జరుగుతుందా లేదా ఉన్నత స్థాయి అధికారుల యొక్క ఒత్తిళ్లతో ఆ వ్యక్తి డాక్టర్ పై ప్రయాణం చేయటం డాక్టర్ నీ బొలెరో వాహనం ఢీకొనటంతో అతని ప్రమాదానికి గురైన పరిస్థితి మనం చూశా!! రాష్ట్రంలోనే గతంలో విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక ఉన్నత స్థాయి అధికారిని వాహన ఢీకొనటంతో మరణించిన పరిస్థితులు కూడా తెలంగాణ రాష్ట్రంలో కనిపించింది విధి నిర్వహణలో ఉన్నటువంటి సిబ్బందికి ప్రమాదం జరిగేటప్పుడు అధికారులు తక్షణమే స్పందిస్తున్నప్పటికీ ప్రమాదాలకు అసలు కారణం ఏంటిది వారు వివిధ నిర్వహణ కోసం ఆ సమయంలో ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్నారా లేక వేరే ఇతర కారణాల వల్ల విధుల్లో పాల్గొంటున్నారా తెలవాల్సిన పరిస్థితి ఆ సమయంలో ఎన్ని వాహనాలని తనిఖీలు నిర్వహించారు విధించారు ఎన్ని వాహనాలను సీజ్ చేశారో కూడా పత్రిక ముఖాముఖంగా తెలియజేయకపోవడం. అసలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తనిఖీలు నిర్వహణ జరుగుతుందా జరుగుతున్న సమయంలో ప్రభుత్వం కఠిన నిబంధనలతో కూడినటువంటి తనిఖీలు నిర్వహించే విధంగా ఎలక్షన్ నియమవాలి సమయంలో ఏ విధమైన తనిఖీలు నిర్వహించేటప్పుడు వీడియోలు చిత్రీకరించడంతో తనిఖీలు నిష్పక్షపాతంగా జరుగుతున్నాయి అన్న విధంగా ఉన్నత స్థాయి అధికారి ఒక్కసారి ఒక ప్రాంతంలో తనిఖీలు చేసేటప్పుడు తప్పనిసరిగా వీడియో కవరేజ్ చేసినప్పుడు మాత్రమే ప్రభుత్వానికి రావలసన ఆదాయం వస్తుంది తప్ప లేకపోతే అధికారి సొంత జేబులోకి ఆదాయం వెళ్తున్నట్లు కూడా విమర్శలు అనేకం వినిపిస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఈ విధమైన ధోరణి అవలంబిస్తున్నారు అన్న నెపంతోనే చెక్ పోస్ట్లు తీసివేయటమే కాకుండా ఆర్టీవో అధికారులపై గతంలో అనేక ఏసీబీ దాడులు  సైతం జరిగిన పరిస్థితి, కొంతమంది అధికారులు ఏసీబీ దాడులు జరిగినంత మాత్రం  ఏం జరుగుతుందిలే ఉన్నత స్థాయి అధికారుల ప్రోత్బలం మాకు లభిస్తుంది కదా వారి యొక్క సహాయ సహకారాలు ఉన్నప్పుడు మేము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అన్న విధంగా కూడా కొంతమంది వారి విధానం నడుస్తున్నట్లు కూడా సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్టిఓ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారి స్థాయి నుంచి కిందిస్థాయి సిబ్బంది వారికి వారి యొక్క ఆదాయ వ్యవహారాలు విషయంలో ఎప్పటికప్పుడు సమగ్ర విచారణ జరిగినప్పుడు మాత్రమే వారి యొక్క విధానంలో మార్పు జరుగుతుంది లేకపోతే వారి యొక్క ఆదాయం పెరుగుతుంది తప్ప ప్రభుత్వ ఖజానాకు మాత్రం ఎటువంటి ఆదాయం సమకూరదు అన్న దానికి ఉదాహరణ తమిళనాడు రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వ కార్యాలయంలో ఎవరైనా లంచం అడిగినట్లయితే వారి వివరాలు తెలియజేసినట్లయితే వారికి పారిదోషకం అందించడమే కాకుండా ఇంకొకసారి ఏ అధికారి కూడా లంచమడకడా చేసే విధంగ  ప్రాణాలకు రూపొందిస్తా అన్న విధంగా ఈ రాష్ట్రంలో కూడా ఆ విధమైన నిబంధనలు వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి కిందిస్థాయి ఉద్యోగులకు ఉన్నత స్థాయి అధికారుల యొక్క ఒత్తిళ్ల వల్ల ప్రాణాపాయ స్థితి నుంచి కొంత మంది బయటకు వస్తే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అన్న విమర్శలు సైతం కోకొల్లలుగా వినిపిస్తున్నాయి, ముఖ్యంగా ప్రభుత్వ నిబంధన అనుసారం అధికారి యొక్క ఆర్థిక లావాదేవులపై ఐటి, అధికారులు ఎప్పటికప్పుడు ఆర్థిక లావాదేవులపై సమగ్ర విచారణలు జరిపినప్పుడు మాత్రమే వీరి యొక్క విధానంలో మార్పులు వస్తాయని మరొక మారు ఉన్నత స్థాయి అధికారుల వల్ల ఇబ్బందులకు గురైనటువంటి బాధ్యత కుటుంబాలు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది మరిన్ని ముఖ్యమైన సమాచారంతో మరొక కథనంతో మీ ముందుకు వస్తాం. మీ అక్షిత మీడియా యాజమాన్యం!!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview