ఈనెల 16న హెడ్ ఆఫీస్ ధర్నా తాత్కాలిత వాయిదా


 



ఈనెల 16న హెడ్ ఆఫీస్ ధర్నా తాత్కాలిత వాయిదా

 అందజేశారు.ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(TUCI) రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకుబ్ షావలి

ఇల్లందు, అక్షిత మీడియా;-సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని, లాభాల వాటా పెంపుకై పునరాలోచన చేయాలని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకుబ్ షావలిప్రభుత్వాన్ని,సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సింగరేణిలోని వివిధ కాంట్రాక్టు కార్మికుల అడ్డాలలో జరిగిన మీటింగ్లలో పాల్గొని మాట్లాడారు.అనంతరం జిఎం వీసం కృష్ణ కి వినతి పత్రంఅందజేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి కాంటాక్ట్ కార్మికుల రెక్కల కష్టంతో వచ్చిన లాభాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫుట్బాల్, క్రీడలకు జాబ్ మేళాలకు డివైడర్లకు వీధిలైట్లకు ఖర్చు పెట్టిందన్నారు. ఈ కార్మికులతో వచ్చిన లాభాలలో కాంట్రాక్ట్ కార్మికులను కేవలం 5,500 ఇచ్చి మోసం చేస్తున్నారని మండిపడ్డారు.2023లో జరిగిన 18 రోజుల సమ్మె సందర్భంగా సింగరేణి యాజమాన్యం నెల రోజులలో వేతనాలు పెంచుతామని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీతో అగ్రిమెంట్ చేసుకొని సంవత్సరాలు గడుస్తున్నా వేతనాలు పెంచకపోవడం సరైనది కాదన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచలేదని మేము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీనిచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టిందన్నారు. వారి హామీని నమ్మి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కోల్ బెల్ట్ ఎమ్మెల్యేల గెలుపులో ఈ కార్మికులు భాగస్వామ్యం అయ్యారని అన్నారు. ఇప్పటికైనా కాంట్రాక్ట్ కార్మికులకు లాభాలలో 10 శాతం వాటర్ కేటాయించాలని డిమాండ్ చేశారు ఈనెల 16న హెడ్ ఆఫీస్ ధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని తెలిపారూ, ఈ సమావేశంలో మండల పాయం వెంకన్న, మల్లెల వెంకటేశ్వర్లు భానో త్ రామ్సింగ్ పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview