పోలీస్ అమరవీరుల స్మారకార్థం ఇల్లందులో మెగా రక్తదాన శిబిరం

 


పోలీస్ అమరవీరుల స్మారకార్థం ఇల్లందులో మెగా రక్తదాన శిబిరం

ఇల్లందు, అక్షిత మీడియా:- పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇల్లందులోని రాజస్థాన్ సేవా ట్రస్ట్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి సింగరేణి జనరల్ మేనేజర్ వీసం కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇల్లందు డీఎస్పీ వెంకన్నబాబు మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను స్మరించుకుంటూ సమాజ సేవలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు తరచూ రక్తం అవసరమవుతుందని, వారి ప్రాణాలను కాపాడటంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. శిబిరంలో సేకరించిన రక్తాన్ని తలసేమియా బాధితుల అవసరాల కోసం సంకల్ప సేవా సమితికి అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ శిబిరంలో యువకులు, విద్యార్థులు, పోలీస్ అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాతలను అధికారులు అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు సురేష్, సత్యనారాయణ, తిరుపతితో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview