అంగన్వాడీలకు కనీస వేతనం పెంచే వరకు ఉద్యమం ఆపేది లేదు. సిఐటియు నాయకులు హెచ్చరిక!!
తిరుపతి, అక్షిత మీడియా;-
అంగనవాడి టీచర్లకు,కనీస వేతనం 26000, ఆయాలకు, 20000 పెంచాలని, పెండింగ్ఉన్న 1810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్స్ చేసి మెయిన్ సెంటర్ గా మార్చాలని, చట్టబద్ధమైన గ్రాట్యూటీ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరుతూ అంగనవాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్( సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ,తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద, పెద్ద ఎత్తున, సిఐటియు ఆధ్వర్యంలో, నిరాహార దీక్షలు ప్రారంభమైనాయి.ఈ సందర్భంగా సిఐటియు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు. బాలసుబ్రమణ్యం. సిహెచ్ చంద్రశేఖర్, అంగన్వాడి యూనియన్, జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి, వాణిశ్రీ, అన్నమయ్య జిల్లా అధ్యక్షురాలు, ఎస్ శ్రీలక్ష్మి, మాట్లాడుతూ. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచలేదన్నారు. గత ప్రభుత్వంలో, అంగన్వాడి ఆందోళనకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కుప్పం లో జరిగిన అంగన్వాడి ధర్నాలో పాల్గొని మద్దతు ఇచ్చారని, అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా, వేతనాలు పెంచలేదన్నారు. ధర్నాలోఐ సి డి ఎస్ కి బడ్జెట్ అంగన్వాడీలకు వేతనం పెంచకపోవడం దారుణం అన్నారు. వేతనాలు పెంచే వరకు, ఉద్యమం ఆపేది లేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంగన్వాడీలకు తీవ్రమైన అన్యాయం చేసింది స్త్రీ శిశు సంక్షేమ శాఖకు కేవలం 4259లో కోట్లు కేటాయించారు ప్రస్తుతం అవసరాలకు ఈ బడ్జెట్ కేటాయింపు సక్రమంగా లేదన్నారు పౌష్టికమైనటువంటి ఆహారానికి కూడా ఈ బడ్జెట్ సరిపోదన్నారు. అంగనవాడీలకు పెరుగుతున్న ధరలు కనుగుణంగా వేతనాలు పెంచాలని 42 రోజులు చారిత్రాత్మకమైనటువంటి సమ్మెను నిర్వహించారు ఈ సందర్భంగా 2024లో జూలైలో వేతనాలు పెంచుతామని రాతపూర్వకంగా మినిట్స్ఇచ్చిన ఈ బడ్జెట్లో పెంచకపోవడం దారుణం అన్నారు.రాష్ట్రంలో ఇటీవల కొన్ని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్ గా అప్డేట్ చేశారు ఇంకా కొంతమంది అర్హతకు ఉన్న మెనీ వర్కర్లకు 10వ తరగతి పాస్ మెయిన్ సెంటర్ కి అప్డేట్ చేయలేదు రాష్ట్రంలో మరో 1810 మినీ సెంటర్లో క్వాలిఫై లేదని మెయిన్ సెంటర్ గా మార్చకపోవడం అన్యాయం అన్నారు.2024 లో మార్చిలో అంగన్వాడీలకు గ్రాడ్యుటి,అమలు చేస్తామని జీవో నెంబర్ 8 ఇచ్చారు అయితే నేటికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చట్టాన్ని అమలు చేయడానికి గైడ్లైన్స్ మాత్రం రూపొందించకపోవడం దుర్మార్గమన్నారు .2025లో డిసెంబర్ తర్వాత కొంతమందిని కూడా రిటైర్మెంట్ అయ్యారు మరి కొంతమంది సర్వీస్ లో ఉండి చనిపోయారు వారికి ఎటువంటి బెనిఫిట్ రాలేదన్నారు, రూరల్ లో ఉన్న అంగన్వాడీ వర్కర్లకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు కాకపోవడం బాధాకరమన్నారు.సంక్షేమ పథకాలు అన్నిటినీ అమలు చేయాలని, డిమాండ్ చేశారు. అన్ని యాపులు ఒకే యాప్ గా చేయాలని, నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నారు. కావున ఈ సమస్యల పరిష్కారం కావాలని అన్ని ప్రాజెక్టుల దగ్గర రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తా ఉన్నాం అదేవిధంగా కలెక్టరేట్ వద్ద ఈనెల 26, 27, కలెక్టర్ కార్యాలయం వద్ద, ధర్నాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమస్య పరిష్కారం కాకపోతే మార్చి రెండో తేదీన విజయవాడలో జరిగే మహాధర్నాల జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నిరాహార దీక్షలు, విషయం తెలుసుకొని, ఈ కార్యక్రమంలో, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, తిరుపతి జిల్లా అధ్యక్షురాలు, నీలిమ, మహిళా సంఘం ఐద్వా జిల్లా కార్యదర్శి, సాయి లక్ష్మి, ఐఎఫ్టియు, జిల్లా నాయకులు హరికృష్ణ, ఏఐటీయూసీ నాయకులు, సంఘీభావం ప్రకటించారు. అంగన్వాడి సిఐటియు నాయకులు,ప్రాజెక్టు అధ్యక్షురాలు, రమాదేవి, వర్కింగ్ ప్రెసిడెంట్, రాధా, కోశాధికారి పద్మ, వనజ కుమారి, వసంత, సుధామణి, లీలావతి, తిరుపతి సిఐటియు నాయకులు హరి,బుజ్జమ్మ, తదితరులు పాల్గొన్నారు.


0 కామెంట్‌లు