బొగ్గుట చరిత్ర, బొగ్గుట(సింగరేణి) అనగానే గుర్తుకొచ్చేది ఇల్లందు

 మన సింగరేణి మన ప్రాంతం మన ఇల్లందు (బొగ్గుట)



సింగరేణి అనేది ఘనత చరిత్రతో కూడుకున్న పరిస్థితి కొన్ని వందల వేల మంది ఉపాధి కల్పించి నల్ల బంగారం. బంగారపు సిరులు కురిపించే విధంగా రూపుదిద్దుకున్న పరిస్థితి అసలు సింగరేణి ఏ విధంగా ఉత్పన్నమైంది సింగరేణి చరిత్ర ఎక్కడ పుట్టింది అన్న సారాంశం పై నేడు మన అక్షిత మీడియా లో కథనం 



మొట్టమొదటిసారిగా 1871 సంవత్సరంలో డాక్టర్ విలియమ్స్ కింగ్ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో గోదావరి పరిపాక ప్రాంతమైనటువంటి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న తరుణంలో  ఉమ్మడి ఖమ్మం జిల్లా (అప్పటి వరంగల్ తాలూకా) ఉన్నటువంటి ఇల్లందు ప్రాంతంలో ఇక్కడ తన వంటవార్పు కోసం కట్టెలతో నిప్పు రాజేస్తున్న తరుణంలో రాళ్లు మండటానికి చూసి ఈ రాళ్లు ఈ విధంగా మండుతున్నాయి దీనికి ఏదో చరిత్ర ఉంది అని దానిపైన పరిశోధనలు ప్రారంభించారు. ఆ తర్వాత 1886లో ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి ది హైదరాబాద్ (డేక్కన్) కంపెనీ లిమిటెడ్ ఇల్లందు అనే ప్రాంతానికి బొగ్గు తవ్వకాలని ప్రారంభించాలి దానికి కావాల్సిన హక్కులను సంపాదించిన వ్యక్తి సర్ ఆర్ధర్ కాటన్ . ఇప్పుడు మనం ఏదైతే ఉందో సింగరేణి నల్ల బంగారం పై తిని ప్రతి గింజ పైన కూడా  కింగ్, కాటన్ పేరు ఉంటుంది అంటానికి నిలువెత్తు నిదర్శనమే సింగరేణి ప్రతిభ.



 తర్వాత క్రమంలో 23 డిసెంబర్ 1920 నాడు హైదరాబాద్ కంపెనీస్ చట్టం రూపొందించిన ప్రకారం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గా ఏర్పడడ జరిగింది. ఏర్పడ్డ పేరు హైదరాబాద్ (డెక్కన్ ) కంపెనీ  లిమిటెడ్ కి చెందిన సమస్త హక్కులను పొందింది. స్వతంత్రం కన్న ముందు బ్రిటిష్ ఆధ్వర్యంలో నడుస్తున్న సింగరేణి స్వతంత్రం వచ్చిన తర్వాత 1956లో కంపెనీస్ చట్టం ప్రకారం ప్రభుత్వ సంస్థగా అవతరించడం జరిగింది. సింగరేణి లో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రత కోసం ఉద్యోగ సంఘాల ఎన్నికలు వాటి యొక్క హక్కులపై పకడ్బందీగా చట్టాలు రూపొంది పరిస్థితి. 


యూనియన్ ఎన్నికల్లో గెలుపొందిన గుర్తింపు సంఘాలు ప్రాతినిధ్య సంఘాలతో సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఎప్పటికప్పుడు వాటిపై సమగ్ర ఎంక్వయిరీ నడుస్తూనే ఉంటాయి. తర్వాత క్రమంలో 60 సంవత్సరాలలోపు ఎవరైతే కార్మికులు ఉంటారో వారు ఉద్యోగ విరమణ పొంది వారసత్వంగా వారి పిల్లలకి ఇచ్చే హక్కు కల్పించే విధంగా కూడా సింగరేణి రూపకల్పన జరిగింది. దీని ద్వారా తెలంగాణ ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతమైన వరంగల్ కరీంనగర్ అదిలాబాద్ ఖమ్మం పరిసర ప్రాంతాలలో బొగ్గు విస్తరించి ఉండటం దానికి గోదావరి పరివాహక ప్రాంతమే పురిటిగడ్డంగా మారటం విశేషం.



 చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లో సింగరేణి ఉద్యోగుల యొక్క వారసత్వ ఉద్యోగాలను తొలగించటంతో ఈ ప్రాంతంలో ఉద్యోగుల యొక్క సంఖ్య క్రమేపి తగ్గుకుంటూ వస్తుంది .దానితోపాటు ఓసీల మీద ఓసీలు ఏర్పడటంతో అండర్ గ్రౌండ్ మైన్స్ నడిస్తే మ్యాన్ పవర్ అవసరం కానీ ఓసీలక మిషనరీలపై ఆధారపడే అవసరం ఉంటుంది కాబట్టి ఓసిలకే ప్రాధాన్యతస్తూ ప్రభుత్వాలు కార్మికుల యొక్క హక్కులను కాలు రస్తున్నారు అన్న విమర్శలు కూడా నేటి తరుణంలో కనిపిస్తున్నాయి. సిరులు కురిపించిన సింగరేణి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా పాలకుల యొక్క కార్యచరణ ఉండాలి అని సింగరేణి గోదావరి పరిపాక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు కోరుకుంటున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు