ఆన్లైన్ బిజినెస్ పేరు మీద భారీ మోసం పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన బాధితులు
కారేపల్లి ,అక్షిత మీడియా;-ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సూర్య తండకి చెందినటువంటి బానోతు సాయి అనే వ్యక్తి యూట్యూబ్లో ఓకే సాయి పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఆన్లైన్ బిజినెస్ ట్రైనింగ్ పేరు మీద బాధితుల వద్ద నుంచి పదివేల నుంచి 2 లక్షల రూపాయల వరకు వసూలు చేసి వారికి ఆన్లైన్ లో ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. మీరు మీతో పాటు పదిమంది చేర్పించినట్లయితే మీకు అధికంగా డబ్బులు వస్తాయి అని చెప్పి నమ్మబలికి మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు అని స్థానిక కారేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద బాధితులు స్థానిక సీఐ ఎస్ఐ వద్ద ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి స్పందించినటువంటి స్థానిక సీఐ సాగర్ బాధితుల వద్ద నుంచి ఫిర్యాదు తీసుకొని దానిపై సమగ్ర విచారణ జరిపించి బాధితులకి న్యాయం జరిగే విధంగా చూస్తామని తెలియజేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారే కాకుండా కర్ణాటక తమిళనాడుకు చెందినటువంటి అనేకమంది బాధితులు వద్ద ఆన్లైన్ బిజినెస్ పేరు మీద 2020 రెండు నుంచి ఈ విధమైనటువంటి ఆన్లైన్ బిజినెస్ పేరు మీద ఓకే సాయి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచారం నిర్వహిస్తూ టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా అభ్యర్థుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి తర్వాత తన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో నుంచి సభ్యులను తొలగించడం జరుగుతుంది. ఇదేం దాన్ని ప్రశ్నిస్తే వారిపై దుర్భాషలాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు అని బాధితులు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా తీసుకున్నట్టయితే చిన్నపిల్లల తల్లులు, మహిళలు విద్యార్థులు సైతం బాధితుల లిస్టులో ఉండటం , పోలీస్ స్టేషన్కు వచ్చినటువంటి బాధితులలో ఒక చిన్న పిల్ల తల్లి తన ఆవేదన వ్యక్తం చేస్తూ అతనిని నమ్మి 50వేల రూపాయలు చెల్లించడం జరిగింది. తర్వాత ఇప్పుడు మోసపోయానని నాకు అర్థమైంది కాబట్టి తక్షణమే నాకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ బతకాలంలో ఒకేసారి యూట్యూబ్ ఛానల్ ద్వారా కార్గో సర్వీస్ని కూడా ప్రారంభించడం జరిగింది. దానిద్వారా కూడా మీకు ఫుల్లుగా డబ్బులు వస్తాయి దానికోసం డబ్బులు చెల్లించాలి అంటే కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాంతానికి చెందినటువంటి విజయ్ అనే వ్యక్తి 65 వేల రూపాయలు చెల్లించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది. కర్నూలు ప్రాంతానికి చెందినటువంటి కీర్తన, వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి షహీన్, గీత, సంజయ్ కుమార్ కిషోర్ బాబు సాయి నికిత శ్యాంబాబు సాయికుమార్ వీరే కాకుండా అనేకమంది బాధితులు వారి ఇంట్లో తెలియకుండా సైతం ఈ విధంగా చెల్లించడం జరిగింది దీని ద్వారా వచ్చే ఆదాయంతో మా తల్లిదండ్రులకు హార్దిక ఇబ్బందులు లేకుండా మా చదువులకు ఉపయోగపడతాయని బాధితుని మాటలు నమ్మి మేము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే ఉన్నత స్థాయి అధికారులు చొరవి చూపించి మాకు తగిన న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న యూట్యూబర్ బానోత్ సాయి బాధితులు మరిన్ని ముఖ్యమైన సమాచారంతో మరొక కథను తో మీ ముందుకు వస్తాం మీ అక్షిత మీడియా యాజమాన్యం!!




0 కామెంట్‌లు