ఆకతాయిల ఆట కట్టించడానికి విద్యార్థినిగా మారిన ఎస్సై




 విద్యార్థినిగా మారిన మహిళా ఎస్సై అమూల్యా 

భూపాలపల్లి, అక్షిత మీడియా;-

• జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. టేకుమట్ల మహిళా ఎస్సై అమూల్య, విద్యార్థిని వేషధారణలో (స్టూడెంట్ గెటప్) పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యక్షమయ్యారు.• పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిల ఆట కట్టించేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖాకీ యూనిఫాం వదిలి, ఎరుపు రంగు డ్రెస్సులో చేతిలో పుస్తకాలు పట్టుకుని సాధారణ విద్యార్థినిలా వెళ్లారు. పోలీసులు ఏ రూపంలోనైనా మన పక్కనే ఉంటారని నిరూపించిన ఎస్సై అమూల్య ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని స్థానికులు అభినందిస్తున్నారు. ఇది ఆకతాయిలకు ఒక గట్టి హెచ్చరిక అని వారు పేర్కొంటున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview