కాక రేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ డిన్నర్

 



బిగ్ బ్రేకింగ్ 🚨

కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ డిన్నర్ మీటింగ్!

మునుగోడు, అక్షిత మీడియా;-

ఒకేసారి 15 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపగా… గురువారం సాయంత్రం మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా హాజరు.కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కకుండా అడ్డుకుంటున్నారని భావిస్తూ, కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.ఈ రహస్య డిన్నర్ మీటింగ్‌తో రాజకీయ వర్గాల్లో భారీ చర్చ మొదలైంది.బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి జాయినింగ్ వార్త నుంచి కోలుకోకముందే, ఈ 9 మంది ఎమ్మెల్యేల సమావేశం కాంగ్రెస్‌కు మరో షాక్‌గా మారింది.ఈ మీటింగ్ కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతమా?లేక పెద్ద రాజకీయ కుదుపుకి నాందా?రాజగోపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.తెలంగాణ రాజకీయాల్లో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ పెరుగుతోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview