పదో తరగతి విద్యార్థులకు జర్నలిస్టు రాజశేఖర్ సూచనలు

 


10 వ తరగతి విద్యార్ధులకు జర్నలిస్ట్ రాజశేఖర్ నుంచి కొన్ని సూచనలు*

 సోషల్ ఎవర్నెస్, అక్షిత మీడియా;-

1. ప్రతి రోజు రాత్రిపూట 10 గంటల దాక చదవండి.

2. తెల్లవారు ఝామున 4.30 లకు నిద్రలేవండి.

3. మనసులో ఆందోళన లేక ప్రశాంతం గా వుండండి.

4. ఎట్టి పరిస్థితులలోను రాత్రి పూట నిద్రాభంగం కానివ్వకండి.

5. ఉదయం 4.30 to 6.30 వరకూ చదవండి. మధ్యలో కాస్త ఎక్సర్సైజ్ (యోగ, ధ్యానం) చేయండి

6. ఒక అరగంట విశ్రాంతి తీసుకోండి.

7. అరగంట కాల కృత్యాలకు, స్నానానికి కేటాయించండి.

8. తర్వాత పుస్తకం  తిరగెయ్యండి

9. పౌష్టికాహారం లైట్ గా తీసుకోండి.

10. ఉదయం 8.30 కల్లా దూరం వారు, 8.45 కల్లా దగ్గర వారు పరీక్షకు బయలుదేరండి. 8:30 నుండి తొమ్మిదిన్నర వరకు గంట సేపు ఎవరితో మాట్లాడకండి 

11. 8.50 కల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోండి. తోటి విద్యార్థులతో మాట్లాడకండి

12. ప్రశాంతం గా పరీక్ష హాలు లోకి చిరునవ్వుతో వెళ్ళండి.

13. ఉపాధ్యాయులు (Invigilators) చెప్పే సూచనలు గమనించండి.

14. జవాబు పత్రం ఇవ్వగానే దానికి మార్జిన్లు కొట్టండి.

15. ప్రశ్నాపత్రం క్షుణ్ణంగా చదవండి.

16. బాగా వచ్చిన ప్రశ్నలు ముందుగా వ్రాయండి.

17. తప్పులు,కొట్టివేతలు లేకుండా వ్రాయండి.

18. రాసేటప్పుడు,ప్రశ్న నెంబరు,సెక్షన్ రాయండి.

19. జవాబు అవ్వగానే గీత కొట్టండి.

20. మరొక ప్రశ్నకు ఉపక్రమించండి.

21.. ముందు అన్ని తెలిసిన ప్రశ్నలు తప్పులు లేకుండా వ్రాయండి.

22. చివరకు,తెలియని ప్రశ్నలు , ఛాయస్ ట్రై చేయండి.

23. గుర్తు రాకపోతే చిరునవ్వుతో మూడుసార్లు ఊపిరి పూర్తిగా పీల్చుకొని వదలండి స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోతుంది మర్చిపోయిన విషయాలు గుర్తొస్తాయి

24. చివరి 15 నిముషాలు వ్రాసిన పేపర్ ని ఒకసారి పరిశీలించండి.

25. తప్పులు, ప్రశ్న నెంబర్లు సరి చూడండి.

26,మ్యాప్. గ్రాఫిక్ బుక్లెట్,  తర్వాత దారం తో కట్టండి.

27. ముందు తెలిసినవి వ్రాసి, చివరగా ఆలోచించి అసలు ఏది వదలకుండా పూర్తి చేయండి.

28. వార్నింగ్ బెల్ కొట్టినా లేవకండి. అన్ని పరిశీలించాక తృప్తి గా బయటకు రండి.

29. జరిగిన పరీక్షలలో పొరబాటున ఏదైనా తప్పు రాస్తే దానినే పట్టుకుని వేళ్ళాడకండి.. 30. నేరుగా ఇంటికి వెళ్లి లంచ్ చేసి,ఒక గంట నిద్రించండి.31. తరువాత రెండు గంటల వ్యవధిలో మధ్య మధ్య లో 15 నిముషాలు గ్యాప్ ఇస్తూ చదవండి.32. బొమ్మలు, గ్రాఫ్ పేపర్ మీద పెన్సిల్, మ్యాప్ పెన్ తో గుర్తించండి.33. బుద్దిమంతులుగా ఉండండి. కాపీ అనే ఆలోచన మనసులోకి రానీయకండి.34. చక్కని జయాన్ని అందుకుని - అమ్మ, నాన్నల మరియు మీ ఉపాధ్యాయుల ఆకాంక్షలను నెరవేర్చండి.మీ అందరికీ ఆల్ ది బెస్ట్.... 👍👍👍

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview