డ్రగ్స్ కేసులో టిడిపి ఎంపీ పుట్ట మహేష్ కు స్టేషన్ బెయిల్

 



డ్రగ్స్ కేసులో టిడిపి ఎంపీ పుట్టా మహేష్ కు స్టేషన్ బెయిల్

హైదరాబాద్, అక్షిత మీడియా:-

మెయినాబాద్ ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్ మంజూరైంది. సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆయనకు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. టీడీపీ ఏం పి తో పాటు ప్రియాంక రెడ్డికి కూడా బెయిల్ వచ్చింది. డ్రగ్స్ పార్టీలో అర్జున్ రెడ్డి, కౌషిక్ రవి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ, పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. అయితే, ర్యాపిడ్ టెస్ట్‌లో టీడీపీ ఏం పి కి నెగిటివ్ రాగా.. రక్త నమూనాలను పరీక్షించగా పాజిటివ్ వచ్చింది. 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు