లంచం తీసుకుంటే ఏసీబీకి చిక్కిన ప్రిన్సిపాల్

 


రూ. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ప్రిన్సిపాల్…

రాజేంద్రనగర్ ,అక్షిత మీడియా;-

రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ ఎం గోవర్ధన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. మంగళవారం (ఏప్రిల్ 7) ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులు రూ. లక్ష లంచం తీసుకుంటుండగా గోవర్ధన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

సీడ్ కంపెనీ లైసెన్స్ ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నుంచి గోవర్ధన్ లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు అధికారులు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

సీడ్ కంపెనీ లైసెన్స్ కోసం లంచం తీసుకుంటుండగా.. ప్రిన్సిపాల్ గోవర్ధన్ ఆఫీసులోనే అతనిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.

గోవర్ధన్ గతంలో కూడా అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. 2010లో కంప సాగర్ రీసెర్చ్ స్టేషన్ హెడ్ గా వ్యవహరించిన గోవర్ధన్ మూడు కోట్ల రూపాయల విత్తన అవినీతి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview