బరితెగించిన ఇసుక దొంగలు!!
అక్రమ ఇసుకను అడ్డుకున్న ఉపసర్పంచ్ పై దాడికి యత్నం!!
ఫోను కూడా అందుబాటులో లేని పోలీసులు!!
నిద్ర వస్తులో రెవెన్యూ ,మైనింగ్ నీటిపారుదల శాఖ అధికారులు
సారపాక ,అక్షిత మీడియా;-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ కన్నె దార రమేష్ పై ఇసుక దొంగలు దాడి...
వివరాలకు వెళ్తే సారపాక బ్రిడ్జి కింద యదేచ్ఛగా ఇసుక రవాణా జరుగుతుంది అని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ కూడా అధికారులు స్పందించపోవటం వెనుక ఆంతరమేంటిది ?
గత రాత్రి బ్రిడ్జి కింద అక్రమ ఇసుక రవాణా జరుగుతుందా అని తెలిసి ఉపసర్పంచ్ కన్నదార .రమేష్, పాలకవర్గం కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇసుక దొంగలు అతనిపై దాడికి యత్నం చేయడం జరిగింది.
దీనిపై పోలీసులకి సమాచారం అందించడానికి ఫోన్ చేసిన కనీసం ఫోన్ కూడా స్పందించకపోవడం దీని వెనక ఇసుక దొంగల నుంచి రెవిన్యూ మైనింగ్ నీటిపారుదల పోలీస్ డిపార్ట్మెంట్ లకు సంబంధించిన అధికారులకు ముడుపులు అందుతున్నాయి కాబట్టే మాపై దాడి జరుగుతుంది అని.
సమాచారం అందించాలని ప్రయత్నం చేసిన కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు కాబట్టి దీనిపై ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది.
గతంలో కూడా ఒక పార్టీ నాయకుడు ఇసుక దొంగల పై ఫిర్యాదు చేయడంతో అతనిపై దాడి చేసి తీవ్ర స్థాయిలో కొట్టడం జరిగింది. మరవకముందే గత రాత్రి ఉపసర్పంచ్ కన్నదారి .రమేష్ పై దాడికి యత్నం చేయటం అనేది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమ ఇసుక రవాణా చేయటం ద్వారా ప్రజాధనాన్ని వారి సొంత ఖజానాలకు మల్చుకుంటున్న ఇసుక ట్రాక్టర్ల , బుల్, పై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు.
నిత్యం బ్రిడ్జి కింద నుంచి సుమారు 30 నుంచి 50 అక్రమ ఇసుక ట్రాక్టర్ల రవాణా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరుగుతున్నప్పటికీ కూడా ఎన్ని మార్లు పోలీస్ అధికారులు కానీ రెవిన్యూ అధికారులకు కానీ మైనింగ్ అధికారులకి ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందించినప్పటికీ కూడా కనీసం సమాచారానికి స్పందించే అధికారి లేకపోవడం బాధాకరం.
ప్రతి రోజు ఒక్కొక్క ట్రాక్టర్ నుంచి కొంత మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారు అని దాడిలో గాయపడినటువంటి ఉపసర్పంచ్ కన్నదారి .రమేష్ తెలియజేయడం జరిగింది.
కొంతమంది పాత్రికేయులు కూడా దీనిపై వివరణ నిమిత్తం మైనింగ్ జిల్లా స్థాయి అధికారికి చరవాణి ద్వారా వివరణ కొరకు ఫోన్ చేసినప్పటికీ కూడా కనీసం ఫోన్ కూడా ఎత్తె ప్రయత్నం చేయకపోవడం వెనక ఆ ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించకపోవడం వెనక మైనింగ్ ,రెవెన్యూ అధికారులకి భారీ స్థాయిలో ముడుపులు అందుతున్నాయి అనిపిస్తుంది.?
ఏదేమైనా కానీ దాడుల సంస్కృతిని పెంచి పోషిస్తున్న ఇసుక దొంగలపై ఉక్కు పాదం మోపే అధికారి లేకపోవడం వారి యొక్క అడుగులకు మడుగులోత్తే విధంగా అధికారుల చేతివాటం చూపించటం, దీనిద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం మొత్తం ప్రైవేటు వ్యక్తుల యొక్క జేబులోకి వెళ్తుంది అంటానికి ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇకనైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు మొద్దు నిద్ర వీడి దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేస్తున్న సారపాక మేజర్ పంచాయతీ ప్రజలు.
అదే కాకుండా స్థానిక ప్రజలు అర్ధరాత్రి ఇసుక ట్రాక్టర్లు శబ్దాల వల్ల ఇబ్బందులకు గురవుతున్న స్థానిక ప్రజలు!!
దీనిపై కొన్ని మీడియా, పత్రికలలో రావటంతో అధికారులు 7 ట్రాక్టర్లను పట్టుకున్నట్లుగా సమాచారం.
కానీ రాత్రి సుమారు 35 ట్రాక్టర్లు నడుస్తుంటే కేవలం ఏడు ట్రాక్టర్లు పట్టుకోవడం వెనక మిగతా ట్రాక్టర్లు ఎటు వెళ్లినట్టు దొంగలెత్తక పోయారా!! లేక ఇసుక దొంగలే ఇసుకలో టాక్టర్లను పాతి పెట్టారా!! తెలవాల్సిన అవసరం ఉంది!!
మరిన్ని ముఖ్యమైన సమాచారంతో మరొక కథనంతో మీ ముందుకు వస్తాం అక్షిత మీడియా యాజమాన్యం,!!!


0 కామెంట్‌లు