పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు, ముప్పై వేలు జరిమానా, సిఐ ఉస్మాన్ షరీఫ్


పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు, ముప్పై వేలు జరిమానా

రఘునాథపాలెం,  అక్షిత మీడియా ;-ప్రాసిక్యూషన్ కు  సహకరించిన అధికారులును అభినందించిన పోలీసు కమిషనర్ , ఇంటి లో వున్న బాలికను తన మాయ మాటలతో తీసుకెళ్లి లైంగికదాడికి ఒడిగట్టిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్షతో పాటు ముప్పై వేల రూపాయలు జరిమానాలు విధిస్తూమొదటి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు, అదనపు జిల్లా  సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బి.శ్రీనివాసరావు గారు శుక్రవారం తీర్పు వెల్లడించారని ఇన్స్పెక్టర్ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం..2024 ఏప్రిల్ 25 న నిందితుడైన,రఘునాథపాలెం మండలం గణేశ్వరారం గ్రామానికి చెందిన మాలోత్ హుస్సేన్ (27సం) బలవంతంగా ఇంటి నుండి తీసుకెళ్లినట్లు బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన  ఫిర్యాదుతో రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 127/2024.SC.POCSO .52/2024 U/S 366(A),376 IPC సెక్షన్ 5r/w 6 ఆఫ్ పోక్సో చట్టం, 2012. కింద కేసు నమోదు చేసిన అనంతరం విచారణ, సాక్ష్యాధారాల సేకరణ వేగవంతంగా పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశామని తెలిపారు. కేసు పూర్వపరాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడి పై మోపిన నేరం రుజువు కావడంతో పై విధంగా తీర్పు చెప్పారు.ప్రాసిక్యూషన్ తరపున అదనపు ప్రాసిక్యూటర్ శరత్ కుమార్ రెడ్డి వాదించారు. విచారణ అధికారులు అప్పటి ఇన్స్పెక్టర్ శ్రీహరి, ప్రస్తుత ఇన్స్పెక్టర్ ఉస్మాన్ షరీఫ్,  భరోసా లీగల్ ఆఫీసర్ ఎం.ఉమారాణి, కోర్టు కానిస్టేబుల్ సాంబశివరావు, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ శ్రీకాంత్, హోంగార్డ్ చిట్టిబాబు ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview