ఒక స్కార్పియో , రెండు ద్విచక్ర వాహనాలలలో 40 కేజీల గంజాయి పట్టివేత
పాల్వంచ అక్షిత మీడియా;- ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి.సోమి రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ R. కిషన్ గార్ల ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈస్ . సి హెచ్. శ్రీనివాస్ మరియు సిబ్బంది కలిసి రంగాపురం వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వచ్చుచున్న ఒక స్కార్పియో వాహనమును ఆపి తనిఖీ చేయగా దానిలో (27.5) కేజీల ఎండు గంజాయి లభ్యమైంది. ఇట్టి గంజాయిని బినయ సర్కార్, s/o. బాపి సర్కార్, R/o. మల్కాన్గిరి జిల్లా, మల్కాన్గిరి జిల్లా నుండి మహారాష్ట్రకు తరలిస్తూ పట్టుబడినాడు. తదుపరి రెండు వాహనాలను ఆపి తనిఖీ చేయగా మొదటి వాహనం హీరో స్ప్లెండర్ ప్లస్ ని ఆపి తనిఖీ చేయగా దానిలో (06.200) కేజీల ఎండు గంజాయి లభ్యమైంది. ఇట్టి గంజాయి ని A1) నూప రవికిరణ్ S/o. భాస్కర్, R/o. ములకలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
A2) తాళ్ళ ధనరాజ్ (Absconding), S/o. చిన్న రాఘవులు, R/o ములకలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు, మల్కాన్గిరి జిల్లా నుండి ములకలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తరలిస్తూ పట్టుబడినారు. తదుపరి రెండవ వాహనం హీరో గ్లామర్ ని ఆపి తనిఖీ చేయగా దానిలో (06.300) కేజీల ఎండు గంజాయి లభ్యమైంది. ఇట్టి గంజాయి ని A3) వేల్పుల భరత్ S/o. సుందర రావు, R/o. భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు
A4) గద్దల శశాంక్ S/o. భాస్కర్, R/o. ములకలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు మల్కాన్గిరి జిల్లా నుండి ములకలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తరలిస్తూ పట్టుబడినారు. ఈ మొత్తం ర/మూడు వాహనాలలో లభ్యమైన (40) కేజీల ఎండు గంజాయిని, మూడు వాహనాలను మరియు నాలుగు సెల్ ఫోన్ (వీటి మొత్తం విలువ రూ.23,60,000) లను తదుపరి విచారణ నిమిత్తం పాల్వంచ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించడమైనది..
ఇట్టి తనిఖీలలో హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ అహ్మద్, కానిస్టేబుల్స్ రమేశ్ బాబు, రాజు, ప్రసన్నకుమార్, తిరుపతి, ఉపేందర్ లు పాల్గొన్నారు.
*నోట్*: ఏదైనా గంజాయి మరియు మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఉన్నచో టోల్ ఫ్రీ నెంబర్ 18004252523 కు సమాచారం అందించగలరని మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఏఈస్ గారు తెలియజేశారు.
ఇట్టి ప్రెస్ మీట్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి.సోమి రెడ్డి గారు, అసిస్టెంట్ కమిషనర్ R. కిషన్ గారు, కొత్తగూడెం ఎక్సైజ్ సూపరిండెంట్ A. శ్రీనివాస్ రెడ్డి గారు, ఏఈస్ . సి హెచ్. శ్రీనివాస్ గారు, పాల్వంచ సీఐ M. ప్రసాద్ గారులు పాల్గొన్నారు.
