సమాచారం అందించాల్సిన అధికారులే తప్పించుకుంటున్నారా!!
ఫోన్ నెంబర్ కూడా సక్రమంగా రాసే పరిస్థితి లేని అధికారులా!!
జిల్లా ఆర్టీవో కార్యాలయంలో ఈ విధమైన పరిస్థితి ఉంటే మిగతా చోట ఏ విధమైన పరిస్థితి ఉంటుంది!!!
కొత్తగూడెం అక్షిత మీడియా;-2 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందంటారా నిదర్శనం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్టీఏ యాక్ట్ 2005 ప్రకారం ప్రతి కార్యాలయంలో పబ్లిక్ అధికారి సంబంధించిన అధికారుల వివరాలు వారి చరవాణి నెంబరు నోటీస్ బోర్డ్ లో ఉండాలి. దానికి విరుద్ధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అధికారి యొక్క ఫోన్ నెంబర్ తప్పుగా ముద్రించడమే కాకుండా బదిలీ వెళ్లిపోయిన అధికారి యొక్క పేరు చరవాణి నెంబర్ తొలగించి ప్రస్తుతం ఉన్నటువంటి అధికారి యొక్క వివరాలు పొందుపరచాలన్న ఉద్దేశం గాని సమయ భావం కూడా లేకుండా విధులు నిర్వహిస్తున్నటువంటి ఉత్తమ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కొత్తగూడెం ఆర్టీవో కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఆర్టిఏ యాక్ట్ 2005 ప్రకారం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకొని ప్రజా అవసరాల కోసం సమాచారం కోసం అర్జీ చేసుకున్న ప్రతి ఒక్కరికి సమాచార అంతే విధంగా నిబంధన కఠిన తరం చేయాలని విజ్ఞప్తి చేస్తున్న ఆర్టిఏ యాక్టివిస్టులు మరిన్ని ముఖ్యమైన సమాచారంతో మరొక కథనంతో మీ ముందుకు వస్తాం మీ అక్షిత మీడియా యాజమాన్యం!!!


