కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా స్పోక్ పర్సన్ గా... నకరికంటి ఉమా

 



కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా స్పోక్ పర్సన్ గా...

     నకరికంటి ఉమా  

భద్రాద్రి కొత్తగూడెం, అక్షిత మీడియా;-

   టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకై  కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా స్పోక్ పర్సన్ గా విద్యావేత్త LLB, LLM నకిరేకంటి ఉమాకి బుధవారం పాల్వంచలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్  గద్దల రమేష్ నియమక పత్రం అందించినారు 

ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ గద్దల రమేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ ప్రభుత్వ పథకాలు  గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తీసుకెళ్లడంలో యువ నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. నకరకంటి ఉమా  పార్టీ పట్ల  చూపిన అంకితభావం, క్రియాశీలకంగా పనిచేసిన తీరును పరిగణనలోకి తీసుకుని ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. భద్రాద్రి జిల్లాలోని  ఎస్సీ వర్గాల సమస్యలపై నిరంతరం పనిచేస్తూ, పార్టీ బలోపేతానికి  కృషి చేస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు.

నూతన బాధ్యతలు స్వీకరించిన నగరకంటి ఉమా మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రెవిన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ గద్దల రమేష్,గారికి పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని  పార్టీ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారం, అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా జనరల్ సెక్రెటరీ ధార చిరంజీవి, పాల్వంచ టౌన్ అధ్యక్షులు గోలి సదాశివ, బిల్లా సుజిత్, బొల్లెపోగు రామకృష్ణ బొల్లె పోగు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview