వేధింపులు భరించలేక పురుగుమందు తాగిన వ్యక్తి
కల్లూరు, అక్షిత మీడియా;-
ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు వ్యక్తుల వేధింపులు భరించలేక పురుగుమందు తాగి చనిపోతున్నానంటూ ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో స్టేటస్‌గా పెట్టడం కలకలం రేపింది. లోకారం గ్రామానికి చెందిన నూకపోతుల కోటి పొలం వద్ద సెల్ఫీ వీడియో తీస్తూ తనను ముగ్గురు వ్యక్తులు వేధిస్తున్నారని, వారి వేధింపులు భరించలేక పురుగుమందు తాగుతున్నానని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రతి పండుగ రోజూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో బతకడం కంటే చావడమే మేలంటూ వీడియోలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
కోటి పెట్టిన సెల్ఫీ వీడియోను చూసిన గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై పొలం వద్దకు చేరుకున్నారు. పురుగుమందు సేవించిన కోటిని హుటాహుటిన కల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
