స్థానిక సంస్థల పరిశీలకులు కమలమ్మ ని ఘనంగా సన్మానించిన డాక్టర్ షేక్ మహబూబ్ వలి

 


ఒంగోలు, అక్షిత మీడియా;-నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి స్థానిక సంస్థల ఎన్నికల అబ్జర్వర్ గా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యురాలు శ్రీమతి కమలమ్మ , ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ వెంకటేశ్వరరావు  ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా  అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా , రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనారిటీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి  పాల్గొని, పరిశీలకులు కమలమ్మ ని శాలువాతో ఘనంగాసన్మానించారు.అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview