కేంద్ర ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి



కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి.తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొడుగునూరు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన*  


తల్లాడ. అక్షిత మీడియా;-ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో ఈరోజు ఓటరు హక్కుపై కోలుకోలేని దెబ్బపడింది.కోట్ల మంది పౌరుల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఓటర్ల జాబితా సవరణ(సర్) ప్రక్రియ ఒక అంధకారమైన కుట్రగా మారిందనే ఆరోపణలు దేశాన్ని తీవ్రంగా ఊపేస్తున్నాయి.ఈ ప్రజాస్వామ్య విధ్వంసానికి సూత్రధారి, ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశం నలుమూలలా ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి ఈ సందర్భంగా టీపీసీసీ,ఖమ్మం జిల్లా డీసీసీ ఆదేశాల మేరకు, సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొడుగునూరు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో తల్లాడ లో ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల పారదర్శకంగా అమలు చేయడంలో కమిషనర్ విఫలమయ్యారని ఈ సందర్భంగా వారు నిప్పులు జరిగారు అనంతరం జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్ల కార్డులతో నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ నాయకులు, మండల కమిటీ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్పంచులు, ఉప సర్పంచ్లు,వార్డు మెంబర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview