జాతి మరువలేని మహానేత రత్నాకర్ రావు
ప్రజాసేవకే ఆయన జీవితం అంకితం...
ప్రజల కోసం అనునిత్యం తపించే గొప్ప వ్యక్తి రత్నాకర్ రావు
కోరుట్ల ,అక్షిత మీడియా;-తెలుగుజాతి జాతి మరువలేని మహానేత రత్నాకర్ రావు అని ప్రజాసేవకే ఆయన జీవితం అంకితం చేశారని ప్రజల కోసం అనునిత్యం తపించే గొప్ప వ్యక్తి రత్నాకర్ రావు అని కొనియాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు 99 వ జయంతిని పురస్కరించుకొని కోరుట్ల పట్టణ వెటర్నరీ కళాశాల వద్ద గల జువ్వాడి రత్నాకర్ రావు కాశ్య విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గాజంగి నందయ్యతో కలిసి తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగారావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ స్వర్గీయ రత్నాకరరావు నిస్వార్థ రాజకీయానికి నిలువెత్తు నిదర్శనమని పూర్వబుగ్గారం నియోజకవర్గ అభివృద్ధిలో జువ్వాడి రత్నాకర్ రావు పాత్ర మరువలేనిదని ఎన్ని తరాలు మారినా వారి సేవలు చిరస్మరణీయమన్నారు తన రాజకీయ ప్రస్తానాన్ని తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ గా ప్రారంభించి పంచాయతీ సమితి ప్రెసిడెంట్గా సేవలందిస్తూ స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు ఆ తర్వాత మెట్పల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి 1989 99 2004 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నారు 2004లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జువ్వాడి రత్నాకరావు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాల సమగ్ర అభివృద్ధికి పూజారుల సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించి విశేష కృషి చేశారన్నారు ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ధూప దీప నైవేద్య పథకాన్ని ప్రవేశపెట్టి అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు కోరుట్ల పట్టణంలో గతంలో ఎవ్వరూ చేయని అభివృద్ధి ఆయన చేశారని క్రమశిక్షణ నిబద్ధతకు మారుపేరు జువ్వాడి రత్నాకర్ రావు అన్నారు కోరుట్ల పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది అంటే అది కేవలం జువ్వాడి రత్నాకర్ రావు కృషి వల్లనే జరిగిందని పట్టణ ఆటో శివారు నా వెటర్నరీ కాలేజ్ ఇటు చివరన పాలిటెక్నిక్ కళాశాల ను ఏర్పాటు చేసి కోరుట్ల పట్టణ రూపురేఖలను మార్చిన ఘనత స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావుకి దక్కుతోందన్నారు కోరుట్ల నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంత్రి రత్నాకర్ రావు చొరవతో పట్టణంలో సుమారు 4500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని గత ప్రభుత్వం కేవలం 80 ఇండ్లను మాత్రమే అది కూడా వారికి అనుకూలంగా ఉన్న కార్యకర్తలకే కేటాయించింది అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు కోరుట్ల నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు పత్రాలను ఇప్పటివరకు అందజేయడం జరిగిందని అలాగే అర్హులైన ప్రతి ఒక్కరి సొంతింటి కల సహకారం చేసే విధంగా ఇందిరమ్మ ప్రోసిడింగ్ పత్రాలు అందజేస్తామని తెలిపారు గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఒక్క నూతన రేషన్ కార్డులు కూడా మంజూరు చేయలేదని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడమే కాకుండా దేశంలో ఎక్కడా లేనివిధంగా రేషన్ దుకాణాల ద్వారా సన్నబియాని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు అనంతరం ఆయన స్మారకార్థం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జువ్వాడి బ్రదర్స్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గాజంగి నందయ్యతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల సర్పంచులు పలువురు కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
