రోడ్డు విద్యుత్ సౌకర్యం తక్షణమే ఏర్పాటు చేయాలి

 


25 ఏళ్లుగా మౌలిక వసతులకు దూరం

చింతకుంట గిరిజన గ్రామంపై అధికారుల నిర్లక్ష్యం.. రోడ్డు, విద్యుత్‌ కోసం ఎదురుచూపులు*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అక్షిత మీడియా;- బూర్గంపాడు మండలం మోత గ్రామపంచాయతీ శివారు చింతకుంట గిరిజన గ్రామంలో సుమారు 40 కుటుంబాలు 25 ఏళ్లుగా నివసిస్తున్నా ఇప్పటికీ కనీస మౌలిక వసతులు అందలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు, విద్యుత్‌ సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.తమ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ప్రజాదర్బార్‌లో, ఐటీడీఏ, ఎంపీడీవో కార్యాలయం, కలెక్టర్‌ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించినా సమస్యలు పరిష్కారం కాలేదని గ్రామస్థులు వాపోయారు. విద్యుత్‌ సౌకర్యం లేక సాయంత్రం ఆరు గంటల తర్వాత చీకట్లోనే జీవనం సాగించాల్సి వస్తోందన్నారు.గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, ఇతర విద్యా సౌకర్యాలు లేకపోవడంతో చిన్నారులు చదువుకోవాలంటే సుమారు ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని తల్లిదండ్రులు తెలిపారు. వర్షాలు, వరదల సమయంలో పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లడం మరింత ఇబ్బందిగా మారుతోందన్నారు.చింతకుంట గ్రామాన్ని సందర్శించిన సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి సభ్యులు పేరాల శ్రీనివాసరావు గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా గిరిజన గ్రామానికి కనీస రోడ్డు, విద్యుత్‌, అంగన్‌వాడీ సౌకర్యాలు లేకపోవడం ఆవేదన కలిగించే విషయమన్నారు. అధికారులు వెంటనే స్పందించి గ్రామానికి మౌలిక వసతులు కల్పించాలని కోరారు.స్థానిక ఎమ్మెల్యే, ఐటీడీఏ పీఓ, జిల్లా కలెక్టర్‌, మండల అధికారులు చింతకుంట గ్రామ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో దశలవారీగా కార్యక్రమాలు చేపడతామని సిపిఐ నాయకులు పేరాల శ్రీనివాసరావు  తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview