ఇల్లందు, అక్షిత మీడియా;-దక్షిణ మైసూర్ గా పేరు ఉన్నటువంటి ఇల్లందు ప్రాంతంలో నిర్వహించే దసరా ఉత్సవాలలో భాగంగా గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి దసరా ఉత్సవాలలో మీడియా ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులకు ఆహ్వానించడం వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం అ నవాహితీ వస్తున్నప్పటికీ కానీ దానికి భిన్నంగా దసరా వేడుకలలో మీడియాపై అంశాలు విధించడం వారు వెళ్లేటప్పుడు పోలీస్, ప్రైవేటు బౌన్సర్లతో ఆపటం అదే కాకుండా వారు ఆంక్షలు విధించిన దాంట్లో మీడియా ప్రతినిధి మాత్రమే వెళ్ళాలి వారి కుటుంబ సభ్యులు వెళ్లడానికి లేదు అని ఆపడం అనేది అది ఎంతవరకు సమంజసం అని సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి!! ప్రజాధనంతో నిర్వహించేటటువంటి ఇల్లెందు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జమ్మి వేడుకలు అంగరంగ వైభవముగా నిర్వహించినప్పుడు ప్రజాధనంతో నిర్వహించే కార్యక్రమంలో మీడియాపై ఆంక్షలు విధించడం వారికి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం అదే కాకుండా ముఖ్యమైన విషయం ఏంది అని అంటే మీడియాకు సంబంధించినటువంటి శాఖ మంత్రివర్యులు వచ్చినప్పుడు కూడా మీడియాపై ఆంక్షలు విధించడం అనేది మీడియా హక్కులను ఉల్లంఘించడం కాదా అన్న విమర్శలు సైతం ఆ నోట ఈ నోట వినిపిస్తున్నాయి!! ప్రజాధనంతో ఏర్పాటు చేసినటువంటి ప్రైవేటు బౌన్సర్లతో అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, వారి యొక్క కుటుంబ సభ్యులకి సెక్యూరిటీ ఏర్పాటు చేయటం వారిని వివిఐపి గ్యాలరీలకు తీసుకువెళ్లడానికి ప్రైవేట్ బౌన్సర్లతో సకల మర్యాదలు ఏర్పాటు చేయడం ఇది ప్రజాధనమా లేక అధికార పార్టీ నాయకులు యొక్క సొంత ధనమా అన్న విమర్శ సైతం ఆ నోట ఈ నోట వినిపిస్తుంది, ముఖ్యంగా ఇల్లందు నియోజకవర్గమనేది ఒకప్పుడు కమ్యూనిస్టులు కంచుకోటగా ఉన్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే ఈ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు సైతం వారు స్టేజి వద్దకు వెళ్లడానికి కానీ ఆ ప్రాంతంలో నిలబడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా పోలీస్, ప్రైవేట్ బౌన్సర్లతో వారిని పంపించడం వారు సైతం అసహనం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా జరిగినటువంటి జమ్మి వేడుకలలో కనిపించాయి, అధికార పార్టీ నాయకులకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మాజీ ప్రజాప్రతినిధులకి ఇవ్వకపోవడం మీడియాకి ఆంక్షలు విధించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అయిన పద్ధతి అని మాజీ ప్రజా ప్రతినిధి ఈ ప్రాంతానికి సంబంధించిన సీనియర్ కమ్యూనిస్టు నాయకులు కొంతమంది కూడా మాట్లాడిన పరిస్థితి, కాంగ్రెస్ మిత్రపక్షమైనటువంటి పార్టీలకు సైతం పాసులు అందకపోవటం వారిని కూడా దసరా ఉత్సవ్ ప్రాంతంలో అనేక ఇబ్బందులకు గురి అవ్వటం మా పార్టీలో అంతర్గతంగా దీనిపై చర్చించుకుంటూ అని కూడా మాట్లాడుతున్నట్టు సైతం వినిపిస్తున్నాయి!! కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు మొన్న జరిగినటువంటి సద్దుల బతుకమ్మ వేడుకల్లో సైతం కనిపించకపోవడం జరిగినటువంటి దసరా ఉత్సవాలలో కూడా వారికి సంబంధించిన వ్యక్తులకి పాసులు ఇవ్వడంలో కూడా నిరుత్సాహం కలిగించే విధంగా చేశారు, అదే కాకుండా కొంతమంది కౌన్సిలర్లకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే విధంగా వారి యొక్క విధానం నడుస్తుంది అని బహిరంగంగా విమర్శించకపోయినప్పటికీ అంతర్గతంగా వారికి సాన్నిత్యమున్న వ్యక్తులతో మాట్లాడుతున్న పరిస్థితులు కూడా ఇల్లెందు పట్టణంలో వినిపిస్తున్నాయి, అదే కాకుండా ఇల్లందు పట్టణానికి సంబంధించినటువంటి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 13వ వార్డు కౌన్సిలర్ తాను, తాను మిత్ర బృందం ద్వారా దసరా ఉత్సవ వేడుకలు డాన్స్ ప్రదర్శన చేయాలని వారు అన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తుల యొక్క ప్రోత్బలంతో వారిని ప్రదర్శనకి అవకాశం కల్పించకపోవడంతో వేడుకలకు సైతం పాల్గొనక పోవడం అదే కాకుండా దీనిపై ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి ప్రోటోకాల్ ప్రకారం స్థానికంగా ఉన్నటువంటి కళాకారులకు అవకాశం కల్పించకపోవడంతో వారు నిరుత్సాహానికి లోన అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తాయి కాబట్టి లక్షల రూపాయలు వెచ్చించి బయట నుంచి తీసుకొచ్చిన కళాకారులను ఇచ్చిన ప్రాధాన్యత స్థానిక కళాకారులు ఉచితంగా నిత్య ప్రదర్శనలు ఇస్తామన్న అవకాశం కల్పించకపోవడం వెనక ఆంతరమేంటిది అని సైతం 13 వార్డ్ కౌన్సిలర్ దండు సారయ్య సర్వత్ర విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితులు కూడా పత్రికా పరంగా కానీ వివిధ సోషల్ మీడియాకు సంబంధించిన ఛానల్ లో కానీ వ్యక్తపరచిన పరిస్థితులు కానీ మనం చూసాం!! అసలు ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో జరిగినటువంటి ఉత్సవ వేడుకలలో మీడియా పైన వివిధ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుల పైన వ్యవహరించిన తీరుపై అధికార పార్టీపై ఇల్లందు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు సైతం విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం!! వేడుకలకు పాల్గొన్నటువంటి భక్తులకు, ప్రజానీకానికి ఏర్పాట్లు చేయడంలో కూడా నిర్లక్ష్యం వ్యవహరించడంతో ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా దసరా ఉత్సవ వేడుకలలో జరిగిన పరిస్థితి కనీసం ప్రజలకు ఏర్పాటు చేయాల్సినటువంటి మంచినీటి వసతుల వద్ద కూడా ఎటువంటి శుభ్రత పాటించకపోవడం మంచినీరు తాగటానికి వచ్చిన వ్యక్తులు కూడా అక్కడున్న పరిస్థితుల్లో చూసి కనీసం మంచినీరు కూడా తీసుకోకుండా వెళ్లిపోయిన పరిస్థితి కూడా జమ్మి వేడుకల్లో కనిపించింది అని సైతం ప్రజలు మీడియా మిత్రుల వద్ద మాట్లాడిన పరిస్థితి, దీనిపై స్పందించాల్సినటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా దీనిపై మాట్లాడకపోవడం అదే కాకుండా మీడియాపై ఆంక్షలు విధించి కొంతమంది మీడియా మిత్రులు వారికి సంబంధించిన కుటుంబీకులని ఉత్సవాల వద్దకు వెళ్లకుండా ఆపుతున్నప్పుడు కూడా అక్కడే ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం వెనక అంతర్గతంగా అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం వారు చెప్పిన విధంగానే పనిచేస్తున్నారా? అందుకనే వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చిన ప్రాధాన్యత మిగతా వ్యక్తులకి మిగతా పార్టీకి సంబంధించిన నాయకులకు మీడియా మిత్రులకు ఇవ్వకపోవడం ప్రధాన కారణమా అన్న విమర్శ సైతం వినిపిస్తున్నాయి ఇకనైనా ఇలాంటి విధానాలు జరగకుండా మీడియా స్వేచ్ఛని భంగం కలిగించే విధంగా ఎవరు ప్రయత్నించకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వనికి ఉందని సైతం మీడియా మిత్రులకు మద్దతుగా నిలుస్తున్నటువంటి ఇల్లందు పట్టణానికి సంబంధించినటువంటి నాయకులు ప్రజానీకం స్థానిక ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరిన్ని ముఖ్యమైన సమాచారంతో మరొక కథనంతో మీ ముందుకు వస్తాం మీ అక్షిత మీడియా యాజమాన్యం
Tags
AndhraPradesh
BreakingNews
BreakingNewsTelangana
Business
Cinema
Crime
E-paper
EPaper
National
Others
Telangana
