ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి. మరో ఇద్దరికి గాయాలు

 


ఘోర రోడ్డు ప్రమాదం  

ఇద్దరుమృతి. మరో ఇద్దరికి గాయాలు

ఇల్లందు, అక్షిత మీడియా;-

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని కిందపడటంతో వాటిపై నుండి లారీ వెళ్లగా ఇద్దరు మృతి చెందిన సంఘటన ఇల్లెందు మండలం సుదిమల్ల స్టేజి, జగదాంబ గుంవిపు వద్ద జ‌రిగింది. బుధవారం మధ్యాహ్నం ఇల్లెందు మండలం కొల్లాపురం గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు వివాహ వేడుక వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇల్లెందు మండలం కొల్లాపురం గ్రామానికి చెందిన పాయం సురేశ్‌, పాయం చిన్ని, పాయం ధనలక్ష్మి (45), జయశ్రీ(18) రెండు బైక్‌ల‌పై ఓ వివాహ వేడుక‌కు హాజ‌ర‌య్యేందుకు వెళ్తున్నారు. ప్ర‌యాణంలో ప్రమాద‌వ‌శాత్తు బైక్‌లు ఒక‌దానినొక‌టి ఢీకొని కింద‌ప‌డ్డాయి. అదే స‌మ‌యంలో వెనుక నుండి వ‌చ్చిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇల్లందు సీఐ తాటిపాముల సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు క్షతగాతృల్ని అంబులెన్సులు, ఆటోల్లో ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview