భూకబ్జాలకు పాల్పడ్డ నంది హిల్స్ వెంచర్ పర్మిషన్ రద్దు చేయాలి. పిడియం





 నరసరావుపేట మండలం పెట్లూరు వారి పాలెం రెవిన్యూ లోని కోటప్పకొండ దగ్గర నంది హిల్స్ వెంచర్ వాళ్ళు పమిడిమర్రు గ్రామానికి చెందిన గాలం కొండలు  సర్వేనెంబర్ 293 లో 186 సెంట్లు భూమి  లో తాను వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. తన భూమి ప్రక్కన

 భూములు కొనుగోలు చేసిన అనీఫ్, ఓబుల్ రెడ్డి, డెవలపర్ రావెళ్ల వెంకటేశ్వర్లు తదితరులు గాలం కొండలు భూమిని కబ్జా చేయాలని  అతనిపై తప్పుడు కేసులు నమోదు చేయించి, అతనిని భూమిలో రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ సమస్యపై స్థానిక మార్కెట్ యార్డ్ వద్ద జరిగిన కార్యక్రమంలో పిడియం రాష్ట్ర కార్యదర్శి జి రామకృష్ణ మాట్లాడుతూ బీసీ యాదవు కులానికి చెందిన గాలం కొండలకి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పేదల భూమి ఆక్రమించి వెంచర్లో కలుపుకున్న నంది హిల్స్ హెంచర్ పర్మిషన్ రద్దు చేయాలని కోరారు. 


ఈ కార్యక్రమంలో బాధితులు గాలం కొండలు, పిడీఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview