కనకదుర్గమ్మ సన్నిధిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క

 







కనకదుర్గమ్మ సన్నిధిలో డిప్యూటీ సీఎం భట్టి  ప్రత్యేక పూజలు...

విజయవాడ, అక్షిత మీడియా;-

విజయవాడలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో కొలువై ఉన్న అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు.


ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గామాత ఆశీస్సులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలపై ఎల్లప్పుడూ నిలవాలని, అమ్మ దయా కరుణా కటాక్షాలతో తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ధి మార్గంలో మరింత ముందుకు సాగాలని ప్రార్థించారు.


ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థాన అధికారులు,పూజారులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారిని సాదరంగా ఆహ్వానించి, పట్టు వస్త్రాలు, పూలమాలతో సత్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి లడ్డూ, తీర్థ ప్రసాదాలను అందజేశారు.


ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో ఉప ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview