కేటీఆర్ ను కలిసిన దండు సారయ్య

 


 




కేటీఆర్ ను కలిసిన దండుసారయ్య 


ఇల్లందు, అక్షిత మీడియా;-


భూదాన్ భూములలో నివసిస్తున్నటువంటి గుడిసెల్ని అక్రమంగా కూల్చడానికి నిరసిస్తూ ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చినటువంటి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన దండు సారయ్య. ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో అనేక సమస్యలున్నాయి , ముఖ్యంగా ఓసి నిర్వాసితుల అధికంగా ఉండే ప్రాంతాలు ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి ఈ ప్రాంతంలో ఉపాధి , నివాసం, పరిహారం అంటే అనేక సమస్యలు ఉన్నాయి వాటిపై అనేకమార్లు సింగరేణి అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వారు దానిపై చర్యలు తీసుకోవట్లేదు. తక్షణమే ఈ ప్రాంతంలో ఎస్సీలు ,బీసీలకు ఉపాధి రావటం కోసం ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో ప్రశ్నించాలని ఈ ప్రాంత సమస్యల పైన . శివశక్తులు ట్రాంజెండర్ల సమస్యలపై అసెంబ్లీలో గల మెత్తని వారి యొక్క హక్కులకు భంగం వాటిల్లకుండా ప్రభుత్వం ప్రతిష్టమైన చర్యలు తీసుకున్న విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, అదే కాకుండా అనేక మందికి ఉండటానికి ఇల్లు రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ లేని పరిస్థితి కాబట్టి వాటిపై కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, దిండికల రాజేందర్, వెంకటేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నరు




1 కామెంట్‌లు

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview