ఆదివాసి కూలీల మృతికి కారకులైన గుత్తి దారులపై చర్యలు తీసుకోవాలి



*జామాయిల్ కటింగ్ గిరిజన కూలీల మరణాలకు కారణమవుతున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలి. కొమరం సావిత్రి 14వ వార్డు మెంబర్ డిమాండ్*

బూర్గంపాడు , అక్షిత మీడియా;-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక లో ఉన్నటువంటి ఐటిసి పేపర్ పరిశ్రమకు సరఫరా చేస్తున్న జామాయిల్ కర్ర కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం కారణంగా జామాయిల్ కొట్టు వలస గిరిజన కూలీలు వరుసగా ఈ కాలంలో మృతి చెందుతున్నారని వారి మృతికి కారణమవుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని గిరిజన కుటుంబాలకు న్యాయం చేయాలని సారపాక మేజర్ గ్రామపంచాయతీ 14వ వార్డు మెంబర్ కొమరం సావిత్రి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక పరిశ్రమకు అనుబంధంగా పనిచేస్తున్న ఎటువంటి కార్మికులకైన రక్షణ కవచం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇటువంటి అంశాలు ఎందుకు మరిచిపోతున్నారో సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలని అన్నారు. కనీస రక్షణ చర్యలు చేపట్టకపోవటమే మరణాలకు కారణం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జామాయిల్ కర్ర కాంట్రాక్టర్లు ధనార్జననే చూస్తున్నారు తప్ప కమిషన్లు ఇచ్చుకుంటూ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు కానీ వలస గిరిజన కూలీల బ్రతుకుల బాగోగులు మాత్రం పట్టించుకోవటం లేదని ఆరోపించారు స్థానిక ఐటిసి పేపర్ పరిశ్రమ ఎన్నో సూక్తులు చెబుతూ రక్షణ చర్యలు చేపడుతున్నామని పేపర్లలో చూపించడమే తప్ప పని ప్రదేశాలలో ఏం జరుగుతుంది కాంట్రాక్టర్లు ఏం చర్యలు తీసుకుంటున్నారు వలస కూలీలు ఎలా ఉంటున్నారు అనే విషయాన్ని గుర్తించి ఉంటే మరణాలు జరిగేవి కాదని అన్నారు పర్యవేక్షణ చేయాల్సిన ఐటిసి అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు వలస గిరిజన కూలీల బ్రతుకుల పై చలగాటము ఆడటం మానుకోవాలని హెచ్చరించారు వలస గిరిజన కుటుంబాలకు న్యాయం చేయకపోతే తాను స్వయంగా గిరిజన సంఘాలను సమీకరించి ఆందోళన నిర్వహించనున్నంటూ తెలిపారు. చనిపోయిన గిరిజన కూలీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని వారి కుటుంబానికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు

1 కామెంట్‌లు

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview