ఖమ్మం ఆర్టీవో బదిలీ వెనకా అంతరం ఏంటిది!!!



 ఖమ్మం ఆర్టీవో బదిలీ వెనక అంతరం ఏంటిది ? 

తాసిల్దార్ గా పని చేసే తరుణంలో పలు విమర్శలు ఎదుర్కొన్న ఆర్డీవో నరసింహారావు .

మెట్టుపల్లి ఆర్డీవో ఒక బదిలీ 

ఖమ్మం ఆర్డీవో గా శ్రీనివాసరావు 


ఖమ్మం ,అక్షిత మీడియా;-

ఖమ్మంలో చర్చనీఆశయంగా మిగిలిపోతున్నటువంటి ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి భూదాన భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇళ్లను కూల్చే ఘటంలో కీలక పాత్ర పోషించినటువంటి ఖమ్మం ఆర్డీవో నరసింహారావు ని బదిలీ చేయడం వెనక అంతరం ఏంటిది? అని సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. 

ఖమ్మంలో కేటీఆర్ పర్యటన నేపథ్యంలోనే ఈ బదిలీ జరగటం వెనుక రాష్ట్ర ప్రభుత్వం, మంత్రుల వ్యవహారం బయటకు వస్తుందని బదిలీ చేశారని విమర్శలు గుప్పిస్తున్న బిఆర్ఎస్ నాయకులు.

ఈ క్రమంలో ఖమ్మం కలెక్టరేట్ సమీపంలోని వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేతలకు సంబంధించి ట్విస్ట్‌ నెలకొంది. కేటీఆర్ బాధితులను పరామర్శించనున్న నేపథ్యంలో ఆర్ సి కూల్చివేతల్లో కీలకంగా వ్యవహరించిన ఖమ్మం ఆర్డీవో నరసింహారావును ప్రభుత్వం అర్ధాంతరంగా బదిలీ చేసింది.

ఖమ్మం ఆర్డీవో నరసింహారావు మెట్ పల్లికి బదిలీ అయ్యారు. కూల్చివేతలపై బాధితులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని మొత్తం అధికారులపై నెట్టే ప్రయత్నంలో భాగంగా బదిలీ చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెట్ పల్లిలో పనిచేస్తున్న ఆర్డీవో శ్రీనివాసరావుని ఖమ్మం ఆర్డీవోగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview