• ఈనెల 16వ తేదీన ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా
సంగారెడ్డి, అక్షిత మీడియా;-
కేంద్ర ప్రభుత్వం ప్రజారత్రిక విధానాలు విడనాడాలని ఉపాధి కూలీలకు హాని కలిగించే విబిజి రాంజీ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని పెండింగ్లో ఉన్న ఉపాధి కూలీలకు తక్షణమే కూలి డబ్బులు ఇవ్వాలని సిపిఎం సదాశివపేట ఏరియా కార్యదర్శి వి ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ఈరోజు సిపిఎం సదాశివపేట ఏరియా నాయకత్వం సదాశివపేట మండలంలోని వెల్టూర్ వెంకటాపూర్ నిజాంపూర్ గ్రామాల్లో పర్యటన చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం సదాశివపేట ఏరియా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎర్రటి ఎండలో పని చేస్తున్న ఉపాధి కూలీలకు పనిచేసిన 8 వారాలు కూలీ డబ్బులు ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఉపాధి హామీ చట్టం 15 రోజుల్లో కచ్చితంగా కూలీ డబ్బులు ఇవ్వాలని చెబుతున్న పాలకులు మూడు నెలలైనా ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. గ్రామాలలో రైతాంగానికి ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో కూలీలు పనిచేస్తున్నారని గ్రామాభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తున్న కూలీలకు ప్రతివారం వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో వేతనాలు చెల్లించకుంటే సంబంధిత అధికారుల జీతాల నుంచి కోతవిధించి కూలీలకు ఇవ్వాల్సి ఉంటుందని కూడా చట్టం చెబుతుందని అధికారుల చొరవ ఎక్కువగా ఉండాలని అన్నారు. మండుటెండలో పనిచేస్తున్నటువంటి కూలీలకు టెంట్ సౌకర్యం మంచినీళ్లు వెంటనే ఇవ్వాలని పని ప్రదేశంలో దెబ్బలు తగిలితే ఐడెం కాటన్ లాంటిది మెడికల్ కిట్టు ద్వారా అందించాల్సింది పోయి ఎక్కడ ఇవ్వడం లేదని వీటన్నింటిని వెంటనే పని ప్రదేశంలో సమకూర్చాలని అన్నారు. ఉపాధి హామీ కూలీలకు నోటికాడి ముద్దను లాక్కునే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చి అనేక ఇబ్బందులు పెడుతుందని అన్నారు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం రద్దు చేసి ఐరిస్ ఫోటోలను తీసివేయాలని డిమాండ్ చేశారు. కొలతలు పద్ధతిలో పనిచేస్తున్నప్పటికీ మళ్లీ ఫోటోలు తీయడం అనేది కూలీల యొక్క సమయపాలనను వృధా చేయడమేనని అన్నారు. ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని పాత పద్ధతిలోనే ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని ఈ నెల 16వ తేదీన సదాశివపేట ఎంపీడీవో కార్యాలయం దగ్గర ధర్మ నిర్వహించడం జరుగుతుంది అన్నారు ఈ ధర్నాలో పెద్ద ఎత్తున ఉపాధి కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కూలీలకు పిలుపునిచ్చారు

0 కామెంట్‌లు