శ్రీరాంపూరo పాయం ఎస్టి కాలనీలో ఆరు నెలలకు గర్భిణీ మృతి

 


*గిరిజన ఆదివాసీ గర్భిణుల మరణాలు ఆగేదెన్నడు...?*

*శ్రీరాంపురం పాయం ఎస్టి కాలనీలో ఆరు నెలల గర్భిణీ మృతి...*

*పోషక ఆహారం, ఆరోగ్య అవగాహన లోపాలే ఇందుకు కారణమా...?*
బూర్గంపాడు ,అక్షిత మీడియా;-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీ పరిధిలో గల శ్రీరామ్ పురం పాయం ఎస్టి కాలనీలో ఆరు నెలల గర్భిణీ భద్రాచలం ప్రభుత్వ హాస్పటల్లో మృతి.

ఆరు నెలల గర్భిణి మృతికి కారణాలు ఏంటి..? సరైన పోషక ఆహారం, కనీస వైద్య అవగాహన లేకపోవడం వల్లనే ఆరు నెలల గర్భిణీ ప్రాణం పోయిందని ఆరోపిస్తున్న పాయం ఎస్టీ కాలనీ గ్రామస్తులు.

ఒకపక్క ఆ గ్రామానికి కరెంటు లేదు దోమలు విపరీతంగా ఉన్నాయి అంగనవాడి సెంటర్ లేక సరైన పోషక ఆహారం గర్భిణీకి అంధక అలాగే గ్రామ ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల అధికారులు అవగాహన కల్పించకపోవడం కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఈ ఆరు నెలల గర్భిణి మృతికి..? ఎవరు సమాధానం చెబుతారు.?

ఈ ఆదివాసీ గిరిజన గర్భిణులు పుట్టగొడుగుల్లా రాలిపోవాల్సిందేనా.? ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని ఆ గ్రామానికి సరైన మౌలిక సదుపాయాలు కల్పించి మరో గర్భిణీ ప్రాణం పోకుండా చూస్తారని ఆశిస్తున్న శ్రీరాంపురం పాయం ఎస్టి కాలనీ ఆదివాసీలు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు