మహిళా వేధింపు కేసులో జైలు శిక్ష విధించిన జడ్జి చంద్రిక రెడ్డి

 




మహిళా వేధింపు కేసులో జైల్ శిక్ష.

ఇల్లందు ,అక్షిత మీడియా;-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

ఇల్లందు ఓ మహిళను వేధించిన కేసులో ఏర్పుల కృష్ణా అనే వ్యక్తికి 18 నెలలు జైలు శిక్ష, ఐదువేల రూపాయల జరిమానా విధించిన ఇల్లందు కోర్టు .

ఇల్లందు జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఓ మహిళను వేధించిన కేసులో ఓ వ్యక్తికి 18 నెలలు జైలు శిక్ష, 5000 రూపాయల జరిమానా విధించింది.

 ఇల్లందులోని 24 ఏరియా చెందిన ఏర్పుల కృష్ణ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అదే ఏరియాలో ఉన్న ఓ మహిళ ను తరచూ వేధింపులకు గురి చేయడంతో ఆ మహిళ ఇల్లందు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి సీఐ వేణు చందర్ కేసు దర్యాప్తు చేసి కోర్టుకు సరెండర్ చేశారు. ఈరోజు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఇల్లందు జడ్జ్ డి. చంద్రిక రెడ్డి ఏర్పుల కృష్ణకు 5000 జరిమానా.18 నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నర్సింగు అనిల్ కుమార్ ప్రాసిక్యూషన్ తరపున వాదించగా , సి డివో సురేష్, రాఘవయ్య, హెచ్ సి అనంత రాములు సహకరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview