దాశరధి జీవిత చరిత్ర పై అక్షిత మీడియా కదనం

  



నాతెలంగాణ కోటి రత్నాల వీణ అని గర్వంగా ప్రకటించిన కవి దాశరధి కృష్ణమాచార్యులు 

తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన కవిగా ప్రసిద్ధి పొందిన వ్యక్తి దాశరధి 

హైదరాబాద్, అక్షిత మీడియా;-

దాశరధి అనగానే గుర్తుకు వచ్చేది తన రచన సాహిత్యం, తన కవిత్వ మాధుర్యంతో అనేక కవిత్వాలు రాయడమే కాకుండా  తెలంగాణ లో తాను రాసినటువంటి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే గానం ద్వారా తెలంగాణ ఉద్యమానికి బాటలు వేసిన పరిస్థితి. 

జీవిత విశేషాలు ;-

దాశరధి కృష్ణమాచార్యులు 1925 జులై 22 న వరంగల్ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో జన్మించాడు, ప్రస్తుతం ఆ గ్రామం మహబూబాబాద్ జిల్లాలో ఉంది. బాల్యంలో ఖమ్మం జిల్లా మధిర లో గడించింది ఉర్దూలో మెట్టుకులేషన్ భూపాల్ పల్లి విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీష్ సాహిత్యంలో ఎంబీఏ చదివాడు . సంస్కృతం ఆంగ్లం ఇంగ్లీష్ ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం ఆలపించడంలో ప్రావీణ్యం సంపాదించాడు. ప్రారంభంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడుగా ఉండి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి హైదరాబాద్ సంస్థానంలో నిజాం మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్పంచుకున్నాడు.  




రచనప్రస్థానం;-

దాశరధి తాను ప్రావీణ్య సంపాదించుకున్నటువంటి అనేక వృత్తిలోజరిగింది . ఉపాధ్యాయుడుగా పంచాయతీ సెక్రటరీగా ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేశాడు సాహిత్యంలో దాశరధి అనే ప్రక్రియలో క్రియ కృషి ఫలితం సంపాదించడం తన యొక్క ప్రాధాన్యతకి తన ప్రావీణ్యతకి నిలువెత్తు నిదర్శనం. 

అనేక కథలకి నాటికలకి సినిమాలకు పాటలు కవిత్వాలు రాశాడు దాశరధి .

నిజాం పాలనకు వ్యతిరేకంగా అనేక రకాల హింసలకి తెలంగాణలో జరుగుతున్న అకృత్యాలకు పీడద ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై గొంతుకగా మారి తాను రాసిన కవిత్వం ద్వారా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేయటంతో నిజాం ప్రభుత్వం అతనిని జైలుకు కూడా పంపించిన చరిత్ర దాశరధి కృష్ణమాచార్యులకు ఉన్నది. ఆంధ్ర మహాసభ చైతన్యతమైన పాత్ర పోషించి నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేసి నిజామాబాద్ లోని హిందూ కోటలో ఆయనను మరొకమారు 150 మందితో కలిసి ఖైదీ చేయటం జరిగింది. జైలు ఖైదీగా ఉన్న తరుణలో ఖైదీలకి ఇచ్చేటటువంటి బొగ్గులతో జైలు గోడలపై కవిత్వాలు రాయడంతో అక్కడున్నటువంటి నిజాం సైన్యం అతనిని కొట్టడం కూడా అనేకమార్లు జరిగిన పరిస్థితి. బావ స్వేచ్ఛ కోసం తాను అని నిత్యం ఊరూరా సాహిత్య సాంస్కృతిక చైతన్యం తీసుకురావడం కోసం తాను రగిలించిన ఆంధ్ర సరస్వత పరిషత్ నిర్మాణంలో ఒకడు. 1953 స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రచయిత సంఘం స్థాపించి అధ్యక్షుడిగా జిల్లాలో సాహిత్య చైతన్యం నిర్మించడమే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న కవులు కళాకారులని ఐక్యం చేయడం కోసం అనేక పోరాటాలు కూడా చేసిన గొప్ప యోధుడు దాశరధి కృష్ణమాచార్యులు. ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా 1977 ఆగస్టు 15 నుండి 1983 వరకు పని చేశాడు . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి దాశరధి రాష్ట్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు గెలుచుకొని అనేక ఉర్దూ గజలకు తెలుగులోకి గాలిపు గీతాలు పేరడ అనువదించిన గొప్ప అనువాదకుడు దాశరధి కృష్ణచార్యులు. ముఖ్యంగా తల్లి మీద తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజం కలిగిస్తూనే ఉంటాయి. 

 




సాహిత్యప్రస్థానం;-

అగ్ని తార రుద్రవీణ తిమిరంలో సమరం వంటి అనేక తెలుగు రచనలు చేసిన గొప్ప సాహిత్య వేత దాశరధి


సినీ ప్రస్థానం;-

1961 లో ఇద్దరు మిత్రులు సినిమాతో సినీ ప్రవేశం చేసిన, వేలాది పాటలు రచించి తెలుగు సినిమా గీతాల మాధుర్యాని దేశానికి తెలియచెప్పిన గొప్ప వ్యాఖ్యాత, కవి,  తెలుగు ప్రజలకి అందించిన గొప్ప కవి రచయిత దాశరధి

మరణం;-

1987 నవంబర్ 5వ తేదీన ఉదయం రక్తపరీక్ష చేయించుకొని వచ్చి 11 గంటల ప్రాంతంలో ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకున్నాడు బాత్రూంలోకి వెళ్లి అక్కడే పడి తదిశ్వాస విడిచిన దాశరధి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview