ఉపాధ్యాయుల ప్రాణాలతో కూటమి ప్రాణాలతో చలగాటం మారుతుంది




*ఉపాధ్యాయుల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం.*

*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం*
*రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. తవ్వా వెంకటయ్య.*
కడప, అక్షిత మీడియా;-
ఎన్నికల ముందు ఉత్తుత్తి హామీలతో ఉపాధ్యాయులకు ఎరవేసి,
జగన్మోహన్ రెడ్డిని ఉపాధ్యాయులకు శత్రువుగా చిత్రించి తదనంతరం ఉపాధ్యాయులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం చివరకు  వారి ప్రాణాలనే హరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.తవ్వా వెంకటయ్య పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన ప్రభుత్వ విధానాలు నశించాలని, కూటమి నేతలు మాయమాటలతో  సామాన్య జనాన్నే కాదు  ఉపాధ్యాయులను కూడా బురిడీ కొట్టించారని, ఉన్నత అధికారుల ఒత్తిడి వల్ల కడప మున్సిపల్ హైస్కూల్ (మెయిన్)లో ఇన్-ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలుగా  పనిచేస్తున్న జింకా జమీమా సుందరం (49)  2026 ఫిబ్రవరి 6న ఆత్మహత్యకు ప్రయత్నించి  చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మరణించారన్నారు.
జనవరి 20 తేదీ  అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట జడ్పీ హైస్కూల్లో సోషల్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పూడి మానీలు (60) తరగతి గదిలోనే  ఛాతీలో తీవ్ర మైన నొప్పితో మృతిచెందారన్నారు.
అలాగే ఫిబ్రవరి 26వ తేదీ గుంటూరులో శ్రీనివాస రావు అనే ఉపాధ్యాయుడు సెలవు పెట్టాడని డిఇవో మందలించడంతో గుండెపోటు వచ్చిందన్నారు,
ఇంకెంత మంది ప్రాణాలు తీసే విధంగా కూటమి ప్రభుత్వ వ్యవహరిస్తుందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  నారా లోకేష్  రెడ్ బుక్ ను పక్కనపెట్టి విద్యా వ్యవస్థను చూడాలని ఆయన హితవు పలికారు.
ఉపాధ్యాయుల హాజరు మరింత కఠిన తరం చేశారన్నారు.
  ఉపాధ్యాయులు పాఠ్యాంశేతర పనుల వల్లే అధిక ఒత్తిడికి గురౌతున్నారన్నారు. యాప్ లతోనే ఉపాధ్యాయుల ఆయువును హరిస్తున్నారన్నారు.
ప్రభుత్వ విధానం ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఉపాధ్యాయుల ఆర్తనాధాలన్నీ శాపాలై ఈ కూటమిని కూకటి వేళ్లతో పెకలించడం ఖాయమన్నారు.
ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన  హామీలలో ఒకే ఒక్క డిఏ తప్ప ఇక ఏ ఒక్క హామీ నెరవేర్చినట్లు ప్రభుత్వం చెప్పగలదా? అని తవ్వా వెంకటయ్య ప్రశ్నించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview