సైన్స్ డే సందర్భంగా సెంట్ ఆంటోని పాఠశాలకు బహుమతుల ప్రభంజనం

  



సెంట్ ఆంథోని పాఠశాలలో బహుమతుల ప్రభంజం  నేషనల్ సైన్స్ డే సందర్భంగా 

సంగారెడ్డి, అక్షిత మీడియా;-

 పట్టణంలోని సంయుక్త ఇంటర్నేషనల్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ ప్రదర్శనలో సెంట్ ఆంథోనిస్  పాఠశాల విద్యార్థులు వారి యొక్క మెరుగైన ప్రాజెక్టులను ప్రదర్శించి మొదటి బహుమతి సాధించడం జరిగింది. ఇందులో 

భాగంగా సంయుక్త ఇంటర్నేషనల్ పాఠశాల ఉపాధ్యాయులు వారికి బహుమతులను అందించడం జరిగింది.

  అదేవిధంగా వాక్సిన్ యూనివర్సిటీలో నిర్వహించిన సైన్స్ ఎక్స్పోలో సెంట్ ఆంటోనీస్ పాఠశాల విద్యార్థులు మరోసారి వారి యొక్క ప్రతిభను చాటారు. వాక్సిన్ యూనివర్సిటీలో వివిధ రంగాల్లో పోటీలు  నిర్వహించారు ఇందులో భాగంగా క్విజ్ ,ఆర్ట్స్, సైన్స్ ప్రాజెక్ట్లకు సంబంధించిన రంగాల్లో సెంట్ ఆంథోని పాఠశాల విద్యార్థులు క్విజ్ లో మొదటి బహుమతిని సైన్స్ లో రెండో బహుమతిని అందుకోవడం మరోసారి వారి యొక్క   విద్యా ప్రతిభను చాటడం జరిగింది. విద్యార్థులు తయారుచేసిన 'స్మార్ట్ అగ్రికల్చర్ ఫ్రెండ్ 'అనే ప్రాజెక్టు అందర్నీ చాలా ఆకర్షణీయంగా ఆకట్టుకోవడం జరిగింది ఇందులో భాగంగా తేదీ2- 3 -2026 నాడు పాఠశాల చైర్మన్ ఈ అంథోనీ రెడ్డి  మరియు ప్రిన్సిపల్ ఆనంద్ రెడ్డి  విద్యార్థులను అభినందిస్తూ వారి యొక్క ప్రతిభను మెచ్చుకుంటూ పాఠశాల ఆధ్వర్యంలో వారికి బహుమతులు అందించడం జరిగింది. ఇందులో భాగంగా పాఠశాల చైర్మన్ ఈ అంతోని రెడ్డి  మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఇలా ఉన్నత దిశకు చేరే విధంగా పోటీపడే ప్రపంచంలో వారి యొక్క ప్రతిభను చాటాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా పాఠశాల చైర్మన్ ఈ అంతోని రెడ్డి  ప్రిన్సిపల్ ఆనంద్ రెడ్డి  వైస్ ప్రిన్సిపల్ సబితా మేడం  కోఆర్డినేటర్ అనిషా మేడం మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు