ఎసిబీ కి చిక్కిన అవినీతి చేప

 


అవినీతి చేపను పట్టుకున్న ఏసీబీ అధికారులు


జోగులాంబ, గద్వాల, అక్షిత మీడియా;-


జిల్లాలోని అయిజా మండలం ఎక్లాస్‌పూర్‌ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి బోయ రాజన్న లంచం తీసుకుంటు అవినీతి నిరోదక శాఖ అధికారులకు పడ్డుబడ్డాడు. ఇందిరమ్మ ఇంటి  నిర్మాణంలో భాగంగా నాలుగు విడతలుగా మంజూరయ్యే నిధుల కోసం కార్యదర్శి ప్రతి బిల్లుకు రూ.5c వేలు చొప్పున డిమాండ్‌ చేశాడు.20 వేలకు గాను రూ.15 వేలు ఒప్పందం కుదుర్చుకుని శుక్రవారం ఎంపీడీవో కార్యలయ ఆవరణలో రూ.15 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడని ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. కార్యదర్శి రాజన్నను అరెస్టు చేసి హైదరాబాద్‌ ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview