కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారినీ దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

 




కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తిరుపతి, అక్షిత మీడియా;-

తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు  తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఇటీవలే వివాహం చేసుకున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య – సాక్షి దంపతులకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని స్వామివారి ఆశీస్సులు కోరుకున్నారు. వారి దాంపత్య జీవితం ఆనందంగా, విజయవంతంగా సాగాలని ప్రార్థించారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు తెలుగు రాష్ట్రాల ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ప్రార్థించారు.కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం తనకు పరమ పవిత్రమైన అనుభూతిని కలిగించిందన్నారు.త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఆర్థిక, సామాజిక రంగాల్లో మరింత పురోగతిని సాధించి, విజన్–2047 లక్ష్యంతో ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఎదగాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview