గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలు ఈ బడ్జెట్ లో నెరవేర్చాలి



గిరిజనులకు ఇచ్చిన  హామీల అమలుకై బడ్జెట్లో 25 వేల కోట్లు కేటాయించాలి.

-తెలంగాణ గిరిజన సంఘం హనుమకొండ జిల్లా కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు 

వి వీరన్న నాయక్, పి శ్రీకాంత్ లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హనుమకొండ , అక్షిత మీడియా;-

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దళితులు, గిరిజనుల ఓట్లే ప్రధానమని అన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో దళితులు గిరిజనులకు అనేక హామీలు ఇచ్చిందని తెలిపారు.అందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను గ్యారెంటీ కార్డుగా ఉపయోగించి చేవెళ్ల డిక్లరేషన్ ప్రకటించిందన్నారు. గిరిజనులకు 15 రకాల వాగ్దానాలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. గత రెండేళ్ల బడ్జెట్లో గిరిజనులకు కేటాయించిన 30 వేల కోట్లలో కేవలం 4 వేల కోట్లు కూడా ఖర్చు చేయకుండా మిగిలిన వేలకోట్ల నిధులను దారిమల్లించిందని విమర్శించారు.


రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న 2026-27 రాష్ట్ర బడ్జెట్లో  గిరిజన వాగ్దానాలకు ఇచ్చిన హామీల అమలుకై 25 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నిధులను అంబేడ్కర్ అభయహస్తం పేరుతో ప్రతి గిరిజన కుటుంబానికి 12 లక్షలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో సుమారు లక్ష కుటుంబాలు ఉన్నందున 12,000 కోట్లు అవసరమవుతాయన్నారు. సమ్మక్క సారక్క గ్రామీణ అభివృద్ధి పథకం కింద రాష్ట్రంలోని ప్రతి గిరిజన గూడెం, తండాల గ్రామపంచాయతీలకు ప్రతి ఏటా 25 లక్షలు ప్రత్యేక నిధి కింద ఇస్తామన్నారు, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 5727 గిరిజన గ్రామ పంచాయతీలకు 1573 కోట్లు కేటాయించాల్సి ఉంటుందన్నారు .గిరిజనులకు మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఒక్కో కార్పరేషన్. కు 500 కోట్లతో చొప్పున 1500 కోట్ల రూపాయలు ప్రతి ఏటా కేటాయిస్తామన్నారు. మైదాన ప్రాంత గిరిజనుల అభివృద్ధికి 5 జిల్లాల్లో ఐటీడీఏలను ఏర్పాటు చేసి ఒక్కో దానికి రూ.500 కోట్లు చొప్పున ఏడాదికి 2500 కోట్లు, ప్రస్తుతం ఉన్న మూడు ఐ టి డి ఏ లను కలుపుకుంటే మరో 1500 కోట్లు మొత్తం 4 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యాజ్యోతి పథకం ద్వారా పదో తరగతి పాస్ అయితే 10వేలు, ఇంటర్ కు 15వేలు, గ్రాడ్యుయేట్ కు 25వేలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కు 1 లక్ష, ఆపైన చదువులకు 5 లక్షలు ఇస్తామన్న హామీకి ఒక్క ఏడాదిలోనే 3 వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూములను కాపాడి గిరిజనులకే హక్కులు కల్పిస్తామన్నారు. ఎక్కడైనా అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుంటే 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం ఇస్తామన్నారు. రాష్ట్రంలో గిరిజనుల సాగులో ఉన్న ఏడు లక్షలకు పైగా పోడు భూములకు హక్కులు కల్పిస్తామన్నారు. అందుకు సరిపడా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నిటికీ నిధులు కేటాయించేందుకు మార్చి 20 న ప్రవేశపెట్టే 2026-27 బడ్జెట్లో నిధులను కేటాయించకుంటే గిరిజనుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బానోత్ జగన్ భూక్య తిరుపతి భూక్య స్వరూప రాయపూరి సారయ్య భూక్య సిద్దు భూక్య లాలు అంగడి ప్రభాకర్ ధరావత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.       వీరన్న నాయక్ 

జిల్లా ప్రధాన కార్యదర్శి తెలంగాణ గిరిజన సంఘం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు