మద్దిశెట్టిని పరామర్శించిన ఎన్సీపీ నాయకులు






 *మద్దిశెట్టి సామేలు ఆరోగ్యం పట్ల ఆందోళన – నివాసంలో పరామర్శించిన ఎన్సీపీ నాయకులు*

దమ్మపేట ,అక్షిత మీడియా;-

ఎన్సీపీ పార్టీ – ఎన్డీఏ మహాకూటమి జాతీయ కార్యనిర్వాహణ మండలి ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ & ఒడిశా రాష్ట్రాల ఇన్‌చార్జ్ అయిన *మద్దిశెట్టి సామేలు* ఆరోగ్యం బాగాలేదని తెలుసుకొని ఐదు జిల్లాలకు చెందిన జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ ఇన్‌చార్జిలు, మండల అధ్యక్షులు , కార్యదర్శులు ఈరోజు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా నాయకులు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో రాజులపాటి ఐలయ్య, పొనక రామదాసు, పుట్టబంతి హరిబాబు, ఊకే వెంకన్న, ఈసం నాగలక్ష్మి, బిర్రు సామేలు, దనసరి సారమ్మ, ఈదుల్లా రవి, పలగాని శ్రీనివాస్ గౌడ్, సూరే సీతారాములు, కిన్నెర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు