ఆర్టీసీ ప్రయాణికులకు షాక్.. ప్రత్యేక బస్సుల్లో ఛార్జీల పెంపు
హైదరాబాద్ ,అక్షిత మీడియా;-
ఆర్టీసీ ప్రయాణికులకు షాక్.. ప్రత్యేక బస్సుల్లో ఛార్జీల పెంపు
తెలంగాణ : ఉగాది, రంజాన్ పండుగ వేళ ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ షాకిచ్చింది. ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. మార్చి 17 నుంచి మార్చి 23వ తేదీ వరకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ స్పెషల్ బస్సులను తిప్పుతోంది. ఈ బస్సుల్లో అదనంగా 50% ఛార్జీలను వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. డీజిల్ ఖర్చులు, బస్సుల నిర్వహణకు అయ్యే ఖర్చుల కారణంగా ఈ ఛార్జీలను వసూలు చేయనున్నట్లు వెల్లడించారు.

0 కామెంట్‌లు