తెలంగాణ ఉద్యమకారుల మోసపోవద్దు

 



*తెలంగాణ ఉద్యమకారులు మోసపోవద్దు*

*తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ పోనుగోటి సంపత్*

భద్రాద్రి కొత్తగూడెం, అక్షిత మీడియా: -

తొలి దశ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి చిరకాల స్వప్నమైనటువంటి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పూటకొకటి ఉద్యమకారుల జేఏసీ పేరుతో పుట్టకొస్తున్న బూటకపు సంఘాల మోసపూరిత వాగ్దానాలతో మోసపోవద్దని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పొనుగోటి సంపత్ పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలుపరిచే వరకు ఉద్యమిస్తామని అనేక బూటకపు సంఘాలు తెరపైకి వస్తున్నాయని ఆ సంఘాలు నడిపేటటువంటి నాయకులు ఉద్యమ సమయంలో ఎక్కడున్నారో, ఏ పార్టీలో ఉన్నారో నిక్కర్సైన  ఉద్యమకారులు గుర్తించాలని, ఉద్యమ సమయంలో కేసులకు భయపడి ఇంటి నుండి కాలు బయటకు పెట్టని వారు నేడు ఉద్యమకారుల జేఏసీ పేర్లతో బూటకపు సమావేశాలు ఏర్పాటు చేసుకొని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న 250 గజాల ఇంటి స్థలం, మరియు ఇల్లు నిర్మాణం, అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక భరోసా, అమరవీరుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం, పెన్షన్ మరియు స్వతంత్ర సమరయోధులుగా గుర్తింపు కార్డులు ఇచ్చి అన్ని విధాలుగా ఉద్యమకారులను ఆదుకుంటాం అనే అంశాన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేయడమే కాక వారి ఆర్థిక స్వలాభాల కోసం సభ్యత్వాల పేరుతో, వారి సంఘాల గుర్తింపు కార్డుల పేరుతో, ఇంటి స్థలాలు ఇప్పిస్తామని, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని కనీసం రిజిస్ట్రేషన్ లేని సంఘాలు అమాయకపు ఉద్యమకారులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఆధారంగా ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చే విధంగా ప్రభుత్వం ఒకవైపు చర్యలు తీసుకుంటూ ఉండగా, ఈ బూటకపు సంఘాలు ఇప్పటికే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా నష్టపోయిన ఉద్యమకారులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొలుపుతూ ప్రభుత్వానికి నిజమైన ఉద్యమకారులకు దూరం పెంచే విధంగా చర్యలు చేపడుతున్నారని దానికి తగిన మూల్యం త్వరలో చెల్లించక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కోదండరాం గారి నేతృత్వంలో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని, దానికి అనుగుణంగా నిజమైన, నిక్కార్స్ అయినా ఉద్యమకారులను గుర్తించే పనిలో రాష్ట్ర ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, సిఐడి, తదితర నిఘ వర్గాల ద్వారా ఇప్పటికే అన్ని జిల్లాల నుండి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వారి వివరాలు సేకరించడం జరిగిందని, నిజమైన ఉద్యమకారులు అనగా ముందస్తు అరెస్టులు, బైండ్ఓవర్ కేసులు, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు, జైల్ రికార్డులు ఎవరైనా కోల్పోయినట్లయితే సమాచార హక్కు చట్టం ద్వారా పొందవచ్చని, కేసులు ఉంటేనే ఉద్యమకారులు లేదంటే ఉద్యమకారులు కాదని ఈ బూటకపు సంఘాల ప్రచారం చేస్తున్నాయని చాలామంది తెలంగాణ జేఏసీ ఇచ్చిన కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించినప్పటికీ కేసులు కాలేదని అంతమాత్రాన వారి ఉద్యమకారులు కాదని అనడం విడ్డూరంగా ఉందన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులని వివిధ విభాగాలుగా గుర్తిస్తుందని తెలిపారు. కనీసం ఉద్యమ సమయంలో రోడ్డెక్కని నాయకులు స్వతాగా సంఘాలు ఏర్పాటు చేసుకొని వారి ఆర్థిక ప్రయోజనాల కోసం వారి మనుగడ కాపాడుకోవడం అమాయకపు తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వానికి దూరం చేయొద్దని కోరారు. ముందుగా ఉద్యమకారుల జేఏసీల పేరుతో వస్తున్న వారు ఆ నాయకుల ఉద్యమ నేపథ్యం జైలు జీవితాలు, పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలు, రౌడీ షీట్లు, పీడి యాక్ట్ ,వారు చేసిన ఉద్యమ నేపథ్యం ఉద్యమకారులకు తెలిపిన తర్వాతనే సమావేశాలు ఏర్పాటు చేయాలని లేని పక్షంలో నిజమైన ఉద్యమకారుల సమన్వయంతో చట్టపరమైన చర్యలకు సిద్ధపడుతామని హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview