వీర వనిత రుద్రమదేవి చరిత్ర

 



1200శతాబ్దంలో కాకతీయ వంశస్థులు రాజ్యపాలన చేసే పరిస్థితులలో కాకతీయ వంశస్థుల యొక్క తీర్మానం ప్రకారం పురుషుడే రాజ్యాధికారం స్వీకరించాలి తప్ప మహిళలకి ప్రాధాన్యత లేని పరిస్థితిలో కాకతీయ రాజు అయినటువంటి గణపతి దేవుడికి ఇన్ని మార్లు సంతన ప్రాప్తి కలిగిన నిలబడని పరిస్థితి తర్వాత చివరి దశలో గణపతి దేవుడికి ఆడపిల్ల జన్మించినప్పటికీ రాజ్య పాలన అధికారం మగవానికే కాబట్టి ఆడపిల్ల పుట్టినప్పటికీ నాకు పుట్టింది మగ పిల్లవాడే అని రాజ్య ప్రజలని రాజ్యాధికార సేనాధిపతులను, కాకతీయ సామంతుల ఆధీనంలో ఉన్నటువంటి ప్రజలలో ఉన్న రాజులకి తెలియకడా ఆ పుట్టిన ఆడపిల్లకి ' రుద్ర దేవగా '  నామకరణం చేసి వీరోచితమైన పోరాటం చేయటం కోసం అవసరమైనటువంటి , విల్లు విద్యలు, కత్తి సాము, వీరోచత విద్యలు, రాజనీతి తదితర రాజ్య పాలనాధికారి ఉండాల్సినటువంటి నీ పని నిబంధనలు తదితరమని కుమార్తె అయిన రుద్రమదేవికి, కుమారుడు అని చెప్పుకొని రుద్ర దేవగా నేర్పించడం జరిగింది. తర్వాత గణపతి దేవుడు 1260-62 ప్రాంతంలో రుద్రమ ను సహా రాజ్యాధిపతిగా నియమించగా, అతి చిన్న వయసులో 14 సంవత్సరాల ప్రయాయంలో, రాజ్యాధికారం స్వీకరించి రాజ్యపాలన చేయడం జరిగింది.ఈ క్రమంలో కాకతీయ సామంతుల ఆధీనంలో ఉన్నటువంటి రాజ్యాలలో ఉన్న కొంతమంది రాజులు వారు రుద్ర దేవా విధానాలు ఆవ భావాలు చూసి తాను పురుషుడు కాదు స్త్రీ అని అనుమానంతో వారు అది నిరూపించాలన్న ఉద్దేశంతో 1261లో దానిపై గూఢచారులు ఏర్పాటు చేయడం తర్వాత క్రమంలో రుద్రదేవ గ పేరొందిన గణపతి దేవుడు కుమారుడు గా చెప్పుకునే ఈ వ్యక్తి కుమారుడు కాదు కుమార్తె అని తెలుసుకొని రుద్రమదేవిగా ప్రావిణ్యం సంపాదించుకొని సమంతా రాజ్యంలో ఉన్న రాజ్యాధిపతులతో కలిసి తన పాలన స్థాపించడం జరిగింది. అనేకమంది రుద్రమదేవి పోరాటాలను చూసి మహిళగా తమతో ఏం పోరాటం చేస్తుంది అని రుద్రమదేవిని తక్కువ అంచనా వేసినప్పటికీ ఆ అంచనాన్ని తలకిందులు చేస్తూ కాకతీయ సామంత రాజ్యంలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులని బయట రాజులను ఆమె సమర్థవంతంగా అణిచివేయటమే కాకుండా తన సంస్థానంలో అనేక రాజ్యాలను విలీన చేయటంలో కూడా వీరోచిత పోరాటం చేసిన వీర వనితగా పేరునటువంటి రుద్రమదేవి. 

 



పాలన ;-        పాలనలో తనకంటూ ఒక ప్రత్యేక పాత్ర ఉండే విధంగా రాజ్యంలో ఉన్నటువంటి సైనికులకి ప్రజలకి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా స్త్రీ అయినప్పటికీ కూడా మగమహారాజుగా పిలవబడే విధంగా తన రాజ్య పాలన స్థాపించడమే కాకుండా ఆమె రాజ్యాన్ని సమర్థవంతంగా పాలించడం. కాకతీయ సామ్రాజ్య అభివృద్ధికి కీలక పాత్ర పోషించే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో కూడా రుద్రమదేవి ప్రత్యేక పాత్ర. 

  వివాహం ;-  వివాహ విషయంలో కూడా రుద్రమదేవి తన రాజ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తన రాజ్యానికి అనుసంధానంగా ఉన్నటువంటి రాజ్యమైనటువంటి నిడదవోలు ప్రభువు అయిన చాణిక్య వీరభద్రుడు తో రుద్రమదేవి అంగరంగ వైభవంగా తన రాజ్యంలో ఉన్నటువంటి పురోహితుల మంత్రాచరణ వివాహం చేసుకోవడం జరిగింది.

రుద్రమదేవి కాకతీయ శాసనాలు కానీ, బురుజులు కానీ, పాలనదక్షిత కోసం అనేక ప్రాంతాలలో ఓడరేవుల నిర్మాణం కానీ చేసిన ఘనత రుద్రమదేవికి దక్కుతుంది. చెరువుల నిర్మాణం కానీ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంలో తమ రాజనీతి ప్రదర్శించడంలో రుద్రమదేవి ప్రత్యేక పాత్ర.

రుద్రమదేవి చివరి యుద్ధంలో 1289లో శత్రువులు దండయాత్రగా కాకతీయ సైన్యంపై దాడి చేసిన తరుణలో చరిత్రకారులు చెప్పిన ప్రకారం దేవప్ప నాయకుడితో యుద్ధం చేస్తున్న తరుణంలో సైనికుల చేతిలో రుద్రమ దేవి వీరమరణం పొందినట్లు చరిత్ర చెబుతుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview