నూతన వధువరులను ఆశీర్వాదించిన ఏపీ సీఎం చంద్రబాబు

 






డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు – కోడలిని ఆశీర్వదించిన ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్, అక్షిత మీడియా ;-

ప్రజాభవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య – సాక్షి నూతన దంపతులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వదించారు. ప్రజాభవన్‌కు విచ్చేసిన చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నందిని దంపతులు పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు నాయుడు, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆనందాలతో నిండాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందజేశారు. మార్చి 5న హైదరాబాద్ లో సూర్య విక్రమాదిత్య సాక్షి ల వివాహ వేడుక ఘనంగా జరిగింది.ఫిబ్రవరి 27న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును వివాహానికి ఆహ్వానించారు. అయితే అప్పట్లో ఉన్న అత్యవసర ప్రభుత్వ కార్యక్రమాలు, బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన వివాహానికి హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలోనే నేడు ప్రత్యేకంగా ప్రజాభవన్‌కు విచ్చేసి నూతన దంపతులకు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview