సిఐటియు ఆధ్వర్యంలో మానవహారం నిరసన ర్యాలీ



*చలో హైదరాబాద్ కు వెళుతున్న అంగన్వాడిలను, రాష్ట్ర నాయకత్వాన్ని అర్ధరాత్రి ముందస్తు అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఇల్లందు లో నిరసన ప్రదర్శన,మానవహారం నిర్వహించిన సిఐటీయు*
ఇల్లందు, అక్షిత మీడియా ;-

ఐసిడిఎస్ వ్యవస్థను బలపర్చాలని బడ్జెట్లో నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టిన 18 వేల వేతనం చెల్లించాలని వేసవి సెలవులు ఇవ్వాలని తదితర డిమాండ్లతో నేడు ఇందిరాపార్క్ కు బయలుదేరుతున్న అంగన్వాడి టీచర్లను రాష్ట్ర నాయకత్వాన్ని ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి గారిని అర్ధరాత్రి అరెస్టు చేసి నిర్బంధించడం హేయమైన చర్య అని దానికి నిరసనగా ఇల్లందు పురవీధుల్లో సిఐటియు ప్రదర్శన నిర్వహించి జగదాంబ సెంటర్ నందు మానవహారం చేపట్టారు ఈ సందర్భంగా జరిగిన సభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈసం వెంకటమ్మ అబ్దుల్ నబీ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ నందు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఎక్కడికక్కడ మంత్రులకు ఈ బడ్జెట్ సమావేశాలలో అంగన్వాడీ వ్యవస్థను బలపరిచే విధంగా బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నేడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద అంగన్వాడీ లు పెద్ద ఎత్తున సభ నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, స్త్రీ శిశు సంక్షేమ మంత్రికు వినతి పత్రాలు ఇచ్చుటకు కార్యచరణ తీసుకోగా నిన్నటి నుండే ఎక్కడికక్కడ పోలీసులు అంగన్వాడీ టీచర్లను అర్ధరాత్రి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడం సరికాదని తాము ప్రజాస్వామ్య పద్ధతులలో సభ నిర్వహణ కొరకు హైదరాబాద్ పోలీస్ పర్మిషన్ తీసుకున్నప్పటికిని అరెస్టు చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందని  హెచ్చరించారు .ఈ సభలో జిల్లా నాయకులు ఎస్కే ఫాతిమా బత్తుల దేవేంద్ర చింతరాంబాయి లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ సుశీల, పి వెంకటమ్మ, ఈ రమకుమారి, సరిత, రేణుక, సమత, వెంకటలక్ష్మి, శారద తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview