అయ్యప్ప మందిరానికి వైస్ చైర్మన్ రేణుక లక్ష రూపాయలు విరాళం

 



అయ్యప్ప మందిరానికి వైస్ చైర్ పర్సన్ రేణుక చిరు లక్ష రూపాయల విరాళం అందజేత.


సంగారెడ్డి , అక్షిత మీడియా;-


సదాశివపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప మందిర ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు మహిళ దినోత్సవ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్  రేణుక చిరు (చిరంజీవి)  పాల్గొనడం జరిగింది. ఆలయ అభివృద్ధి కొరకు 

ఒక లక్ష రూపాయలు(₹1,00,000) విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వైస్ చైర్ పర్సన్ రేణుక చిరు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా మందిరానికి ఎటువంటి మద్దతు కావాలన్న ముందుంటనని ఆలయ కమిటీకి హామీ ఇవ్వడం జరిగింది. దైవ సేవ చేయడంలో మనసుకు ప్రశాంతత లభిస్తుంది అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గోనే శంకర్, ఉపాధ్యక్షులు సుధాకర్, ట్రెజరర్ రాచన్న 

ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు