నాడు కలిసి నడిచినవారు, నేడు కుమారుడు వివాహంలో ప్రత్యేక ఆహ్వానితులా

 



ఉప ముఖ్యమంత్రి భట్టి తనయుడి వివాహం: ప్రత్యేక ఆకర్షణగా 'పాదయాత్ర' బంధువులు!

హైదరాబాద్, అక్షిత మీడియా;-

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తనయుడు సూర్య విక్రమాదిత్య - సాక్షిల వివాహ వేడుకలో ఒక అపురూప ఘట్టం చోటుచేసుకుంది. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల మధ్య.. నాడు భట్టి విక్రమార్కతో కలిసి అడుగులేసిన సామాన్య ఆదివాసీ మహిళలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


*అడవి బిడ్డల అనుబంధం*

గత ఎన్నికలకు ముందు సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి ఖమ్మం వరకు నిర్వహించిన పాదయాత్రలో వీరంతా భాగస్వాములయ్యారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా

జైనూర్ మండలం బూసిమెట్ట కు చెందిన వాలే లక్ష్మీబాయి, డాకూర్ రుక్మబాయి, దుర్గ సిందు, ఉట్నూరు మండలం దేవగూడకు చెందిన

మరప గంగుబాయి, సుమన్ బాయి, సీడం లక్ష్మీబాయి.

వీరంతా పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా, ఎండ తీవ్రతకు భట్టి గారు అలసిపోకుండా, ఆయనకు ఆరోగ్యం దెబ్బతినకుండా తమ సంప్రదాయ ఆదివాసీ పానీయాలను అందించి ఆత్మీయతను చాటుకున్నారు.


*మరువని కృతజ్ఞత.. పెళ్లి పీటలపై గౌరవం*

పదవులు వచ్చినా పాత మిత్రులను మరువని భట్టి విక్రమార్క గారు, తన కుమారుడి వివాహానికి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.

వివాహ వేడుకకు హాజరైన ఆ ఆదివాసీ మహిళలను భట్టి దంపతులు ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కేవలం అతిథులుగా మాత్రమే కాకుండా, వారికి వివాహ వేదికపైనే ప్రత్యేక స్థానం కల్పించి కూర్చోబెట్టడం అందరినీ ఆకట్టుకుంది.

రాజకీయాల్లో మానవ సంబంధాలకు, కృతజ్ఞతకు ఈ ఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview