ఈటల దారేటు, బిజెపిలో ఇమడలేక, సొంతగూటికి ప్రయాణం ఎంచుకుంటున్నాడా?

 



ఈటల దారేటు, బిజెపిలో ఇమడలేక పోతున్నాడా!!

కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదా ,

తనకు భవిష్యత్తు ఇచ్చిన కేసీఆర్ తోనే తన ప్రయాణం సుఖంగా అని సొంతగూటికి చేరటానకి సిద్ధం ??

హైదరాబాద్ ,అక్షిత మీడియా;-

ఒకప్పుడు వెలుగు వెలిగినటువంటి మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరిస్థితి అడకత్తర్ల పోక చెక్క లెక్క తయారైందా!! అంటే అవును అన్న పరిస్థితి అధికంగా కనిపిస్తుంది దీనికి ప్రధాన కారణం బిజెపిలో తగిన ప్రాధాన్యత లేకపోవడం ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గానికి ఈటల వర్గానికి బలమైన కోల్డ్ వార్ నడవడం , గతంలో కూడా తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ అని బలంగా వినిపించినప్పటికీ కూడా తనని కాదని రామచంద్రరావుకి రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇవ్వటం బీసీ నేతగా ఎదిగిన నాకు తగిన గుర్తింపు లేకపోవడం అదే కాకుండా  రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ సామాజిక వర్గంలో బలమైన నేతగా పేరుందినా ఈటెల రాజేందర్ ఒక నియోజకవర్గానికి పరిమితం కావడం వెనక బిజెపి అధిష్టానం ఈటల యొక్క ఎదుగుదలని తొక్కిస్తుందా!!


 అంటే అవును అన్న విధంగానే వారి వర్గం బహాటంగానే విమర్శ ప్రతి విమర్శలు కూడా చేసుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో బలమైన వర్గాన్ని నిలుపుకున్నటువంటి ఈటెల రాజేందర్ ఇప్పుడు ఒక మల్కాజ్ గిరి నియోజకవర్గ పరిధిలోని మిగిలిపోవడం వెనక బిజెపి అధిష్టానం పొమ్మన లేక  పొగ పెడుతుందా!! మరొక పక్క సొంత గూటి నుంచి ఆహ్వానం కూడా వస్తుంది అన్న ఊహకణాలు నేపథ్యంలో 


ఈటల రాజేందర్ అడుగులు తన రాజకీయ ప్రస్తానానికి బాట వేసినటువంటి కేసీఆర్ తో కలిసి నడవడానికి సిద్ధమవుతున్నారా అంటే అవును అన్న ప్రశ్న సర్వత్ర వినిపిస్తుంది, బిజెపిలో తగిన ప్రాధాన్యత లేకపోవడం ఎక్కడ వేరే నియోజకవర్గంలోకి వెళ్లిన ఆ నియోజకవర్గంలో మీరు వేలు పెట్టకూడదు మీ నియోజకవర్గ పరిధికి అంకితం అవ్వాలి అని కఠినమైన నిబంధన విధించడం వెనక బిజెపి అధిష్టానానికి కొంతమంది ఈటల రాజేందర్ పై తప్పుడు సమాచారం అందిస్తున్నారు అన్న విమర్శ నేపథ్యంలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్నటువంటి కమ్యూనిస్టు పార్టీల బలమైన రాజకీయ వ్యూహం లేకపోవడం రాజకీయ ప్రస్థానంలో తనకు గుర్తింపు ఇచ్చిన కేసీఆర్ తోనే తన బాట నడవడం చాలా ఉత్తమం అని తన వర్గం కి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా అనేక మార్లు ఈటెల రాజేందర్  ప్రస్తావిస్తున్నట్టు కూడా సమాచారం వినిపిస్తుంది, బిజెపి పార్టీని వీడి అధికార పార్టీలో చేరటానికి అధికార కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్న వారికే ఒకరికి ఒకరి సఖ్యత లేదు ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రయోజనం ఉండదు. కాబట్టి తనకి భవిష్యత్తు ఇచ్చిన కేసీఆర్ తోనే కలిసి నడవడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం వినిపిస్తుంది పూర్తి వివరాలతో మరొకతనంలో మీ ముందుకు వస్తాం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview