ఎన్సీపీ పార్టీ కమిటిల నియామక చేసిన .మద్దిశెట్టి

 



*ఎన్సీపీ ,ఎన్వైసీ ఆధ్వర్యంలో 172 మంది నాయకులకు నియామక పత్రాలు – యువతతో పార్టీ బలోపేతానికి పిలుపు*
దమ్మపేట, అక్షిత మీడియా;-
ఎన్సీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు  మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి *సునేత్ర పవార్*, రాజ్యసభ సభ్యులు *పార్థ్ పవార్*, అలాగే ఎన్వైసీ జాతీయ అధ్యక్షులు *ధీరజ్ శర్మ*  ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఎన్సీపీ పార్టీ – ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లోని నాయకులకు మొత్తం 172 మంది మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు , అసెంబ్లీ ఇన్‌చార్జిలకు నియామక పత్రాలు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆరు జిల్లాల నుంచి సుమారు 56 మండలాల అధ్యక్షులు , 15 అసెంబ్లీ ప్రాంతాల ఇన్‌చార్జిలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్  ఆంధ్రప్రదేశ్ & ఒడిశా రాష్ట్రాల ఇన్‌చార్జ్ అయిన *మద్దిశెట్టి సామేలు* మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ , ఒడిశా రాష్ట్రాల్లో కూడా ఎన్సీపీ ఎన్వైసీ ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
యువతను ముందుకు తీసుకువచ్చి గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పార్టీ పనిచేయాలని సూచించారు. గత తొమ్మిది సంవత్సరాలుగా పార్టీతో కలిసి కష్టపడి పనిచేస్తున్న బడుగు, బలహీన వర్గాల కార్యకర్తలను గుర్తించి, వారికి ప్రాధాన్యం కల్పిస్తూ ఈ నియామక పత్రాలు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పలగాని శ్రీనివాస్ గౌడ్, రాజులపాటి ఐలయ్య, పొణకా రామదాసు, ఓరుగంటి రమేష్, సూరే సీతారాములు, కిన్నెర రామకృష్ణ, ఈసం నాగలక్ష్మి, కుంజ నాగేంద్రబాబు, కుదురుపాక నిర్మల, బానోత్ జ్యోతి, కొండగొర్ల రమాదేవి, కోరం పద్మ, పుట్టబంతి హరిబాబు, ఈదుల రవి, బానోత్ శ్రీను నాయక్, మచ్చ గిరి, కొట్టే కృష్ణ, కామేపల్లి సురేష్ నాయక్, బిర్రు సామేలు, పూనెం సూరయ్య, సయ్యద్ ఖమ్రుద్దీన్, ఖాద్రి నాగమణి, జబ్బకృష్ణ, భూక్య రవి తదితర మండలాల నాయకులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు