భద్రాచలం రామాలయ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి




 భద్రాచలం రామాలయం అభివృద్ధి పనులపై సమీక్ష

హైదరాబాద్, అక్షిత మీడియా;-

భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి పై సమీక్ష నిర్వహించాను. ఆలయ అభివృద్ధికి సంబంధించిన రూపొందించిన పలు డిజైన్లను పరిశీలించాను. ఆలయ సహజత్వానికి భంగం కలగకుండా, ఆగమశాస్త్రానుసారం అభివృద్ధి పనులు నిర్వహించాలని సూచించాను. మూడు దశల్లో ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులకు  తెలిపాను. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయగలిగిన పనులను ముందుగా గుర్తించి, కార్యచరణ తీసుకోవాలని సూచించాను. 2027 మార్చి 31 నాటికి తొలిదశ అభివృద్ధి పనులు పూర్తిచేసేందుకు లక్ష్యంగా పనిచేయాలని సూచించాను.పుష్కరాలు ముగిసిన అనంతరం మిగతా పనులు పూర్తి చేసేందుకు ఇప్పుడే ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించాను.ఈ సమీక్షకు ఉపముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీమతి కొండా సురేఖ, శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు శ్రీ వేం నరేందర్ రెడ్డి, శ్రీ బలరాం నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview